‘గ్రేటర్’ వార్: టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే!

సీఎం కేసీఆర్ బీజేపీకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వద్దని భావించారు. ఇస్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు. అందుకే సీఎం కేసీఆర్ తొలి నుంచి బీజేపీకి ఎన్నికల్లో ఎలాంటి అడ్వాటేంజ్ రాకుండా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఒకటి అనుకుంటే మరొకటి అవుతోంది. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలవడం గులాబీ బాస్ కు అవమానంగా మారింది. Also Read: బీజేపీ విషయంలో కేసీఆర్ ‘గ్రేట్’ మిస్టేక్ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో […]

Written By: NARESH, Updated On : November 27, 2020 12:48 pm
Follow us on

సీఎం కేసీఆర్ బీజేపీకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వద్దని భావించారు. ఇస్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు. అందుకే సీఎం కేసీఆర్ తొలి నుంచి బీజేపీకి ఎన్నికల్లో ఎలాంటి అడ్వాటేంజ్ రాకుండా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఒకటి అనుకుంటే మరొకటి అవుతోంది. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలవడం గులాబీ బాస్ కు అవమానంగా మారింది.

Also Read: బీజేపీ విషయంలో కేసీఆర్ ‘గ్రేట్’ మిస్టేక్ చేస్తున్నారా?

అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా విజేతగా నిలిచింది. దుబ్బాక ఫలితంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకత ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ ఫలితంపై అసంతృప్తి ఉన్న కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ముందస్తు పావులు కదుపుతున్నారు.

టీఆర్ఎస్ పక్కా ప్లానింగ్ తో బీజేపీని ఎదుర్కొంటోంది. జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదని చాటిచేప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా పోటీలో లేనట్లే కన్పిస్తుంది. దీంతో టీఆర్ఎస్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగుతూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ ఆడటంలో టీఆర్ఎస్ నేతలు ముందుండటంతో బీజేపీ నేతలు సెల్ఫ్ గోల్ అవుతున్నారు.

ఈక్రమంలోనే బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు రాని కేంద్రమంత్రులు ఇప్పుడెందుకు వస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు సైతం ధీటుగా జవాబిస్తున్నారు. వరద సమయంలో ఇక్కడే ఉన్న సీఎం కేసీఆర్ కనీసం హైదరాబాద్లో పర్యటించి నగర వాసులకు భరోసా ఇచ్చారా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.

Also Read: కాపీ కొట్టడానికి తెలివి ఉండాలె.. బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్

తెలంగాణలో కమలం వికసించేలా ఉండటంతో బీజేపీ అధిష్టానం అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సైతం కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చి ప్రచారం చేయనుండటం దీనిలో భాగమేనని తెలుస్తోంది.

తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు సైతం మైండ్ గేమ్ ఆడుతున్నారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులు హైదరాబాద్లో పర్యటిస్తూ టీఆర్ఎస్ కు బీజేపీని ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధించినట్లు కన్పిస్తోంది. ఏదిఏమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్-బీజేపీ మద్య హోరాహోరా తప్పదనే టాక్ నగరవాసుల నుంచి విన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్