భారతదేశంలో మార్చి నెల తొలివారం నుంచి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..?
ఇప్పటేకే మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది. మార్చి నెల నుంచి మే నెల వరకు అమలైన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. లక్షలాది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా వ్యాపారులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో నష్టాలను మూటగట్టుకున్నారు. జూన్ నెల నుంచి అన్ లాక్ సడలింపులు అమలు కావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఎయిర్ పోర్ట్ మూసివేత ..?
ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తే తమ పరిస్థితి ఏమిటని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యాపారులు వాపోతున్నారు. మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తే మాత్రం మూడు కోట్ల మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యే అవకాశం ఉందని పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. మహారాష్ట్రలో మొదటి లాక్ డౌన్ వల్ల 10 లక్షల వ్యాపారాలు మూతబడ్డాయి.
మరిన్ని వార్తలు కోసం:ప్రత్యేకం
ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తే మాత్రం వ్యాపారులు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. హర్షల్ మిరాశీ అనే న్యాయవాది రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయకూడదని సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయకూడదని సూచించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.