Ayodhya Ram Mandir : నిన్నటి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట ఒక అద్భుత కార్యక్రమం. అందులో మోడీ ప్రసంగం.. నిజంగా చాలా యూనిక్ గా ఉంది. ఇది ఒకరోజు సమస్య కాకుండా జరిగినదాన్ని.. జరగబోయే దాన్ని అన్నింటిని నోబుల్ గా టచ్ చేశారు.
భారత్ వేల సంవత్సరాల నాగరికతకు నిలయం. దాని బలమంతా ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం. 190 సంవత్సరాల క్రితమే 1893లో భారతీయ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి చికాగోలో పరిచయం చేశారు. ఆ తర్వాత అదే స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వ్యక్తి గాంధీజీ. రామరాజ్య స్థాపనే లక్ష్యంగా భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపాడు. చివరి సంవత్సరాలు దాన్ని తగ్గించారు. గాంధీ ఆత్మ ఎప్పుడూ ఆయన వైపే ఉంది.
గాంధీని ఓ ఉన్మాది చంపడంతోనే ఈ ఆధ్యాత్మిక పునరుద్ధరణకు బ్రేక్ పడింది. కానీ గాంధీ ఉన్నప్పుడే సోమనాథ్ ఆలయం సహా పునరుద్ధరణకు బీజాలు పడ్డాయి.
అయోధ్య రామాలయంతో తిరిగి ఆధ్యాత్మిక భారత్ గా అవతరించింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.