Attacks On Women In Telangana: తెలంగాణలో దుశ్యాసన పర్వం.. కవితక్కా ఏక్కడున్నావ్‌.. ఈ దారుణాలు కనిపించడం లేదా?

తెలంగాణలో వివస్త్రను చేసినా.. చంపి కాలబెట్టినా.. బాలికపై లైంగికదాడి చేసినా వారి ట్వీట్లు మౌనం వహిస్తున్నాయి. అంటే తెలంగాణ మహిళలు కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాతయి.

Written By: Raj Shekar, Updated On : August 11, 2023 1:50 pm

Attacks On Women In Telangana

Follow us on

Attacks On Women In Telangana: ఆగస్టు 6వ తేదీ విశ్వనగరం హైదరాబాద్‌ శివారులోని జవహర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కాలనీకి చెందిన పెద్ద మారయ్య(30) రోడ్డు పక్కనే ఉన్న వైన్స్‌లో ఫుల్లుగా తాగి అటుగా వెళుతున్న యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహించిన వ్యక్తి.. ఆమెను రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి రోడ్డుపై. నగ్నంగా రోదిస్తూ కూర్చుండిపోయింది.

– ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి.. శంషాబాద్‌ సమీపంలో ఇళ్ల మధ్యలో ఇద్దరు యువకులు ఓ మహిళను దహనం చేశారు. ఎక్కడో చంపి.. ఇక్కడకు తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి కాల్చేశారు.

– ఆగస్టు 11 హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో
కొంపల్లిలో 8 ఏళ్ల బాలికపై శివకుమార్‌ అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి తల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారం రోజుల వ్యవధిలో బంగారు తెలంగాణలో, విశ్వనగరం చుట్టూ మూడు ఘటనలు జరిగాయి. ఒకటి దుశ్యాసన పర్వం అయితే.. ఇంకోటి హత్య, మరొకటి కీచక పర్వం. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గానీ, దేశంలో ఎక్కడో జరిగే ఘటనలపై స్పందించే సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ గానీ నోరు మెదపడం లేదు. వీరి నివాసాలకు కూతవేటు దూరంలో ఈ ఘటనలు జరిగినా మౌనం వహించడం, ఎక్కడో కశ్మీర్, మణిపూర్, గుజరాత్, రాజస్థాన్‌లో ఘటనలు జరిగినప్పుడే దేశం ఏమైపోతోంది అంట్టు ట్వీట్లు చేయడం అనుమానాలకు తావిస్తోంది.

తెలంగాణ మహిళలపై వివక్షా..
తెలంగాణలో వివస్త్రను చేసినా.. చంపి కాలబెట్టినా.. బాలికపై లైంగికదాడి చేసినా వారి ట్వీట్లు మౌనం వహిస్తున్నాయి. అంటే తెలంగాణ మహిళలు కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాతయి. 8 ఏళ్ల బాలికపై కామాంధుడు దాడిచేసినా ఎమ్మెల్సీగానీ, ఐఏఎస్‌గానీ కనీసం స్పందించడం లేదు.

సోషల్‌ మీడియాలో నిత్యం పోస్టులు..
ఇక సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అయితే కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన వీడియోలు, తాను పాల్గొన్న కార్యక్రమాల వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. చేనేత దినోత్సవం వేడుకల వీడియో షేర్‌ చేసిన స్మితాసబర్వాల్, అదేరోజు యువతిని వివస్త్రను చేసిన ఘటనపై మాత్రం స్పందిచలే దు.

కవిత మౌనం..
ఇక ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత తనపై, తన కుటుంబంపై ఆరోపణలు వచ్చినప్పుడు దేశంలోని మహిళలంతా గుర్తొస్తారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు గుర్తొస్తుంది. కానీ తెలంగాణ మహిళలపై దుశ్యాసన పర్వం జరిగినా, చంపి దహనం చేసినా.. బాలికలపై లైంగిక దాడి చేసినా స్పందించలేదు. తాజాగా 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చూపాలని లోక్‌సభలో బండి సంజయ సవాల్‌ చేస్తే.. కరెంటు తీగలు పట్టుకుని చూడాలని ట్వీట్‌ చేశారు ఎమ్మెల్సీ. మహిళను వివస్త్రను చేసిన ఘటనపై మాత్రం మౌనం వహించారు.

వివరణ కోరిన గవర్నర్‌..
హైదరాబాద్‌ నగర శివారులోని జవహర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువ తిని నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనను గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్య లు తీసుకుని నివేదిక సమర్పించాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు.

వివరణ కోరిన జాతీయ మహిళా కమిషన్‌..
జవహర్‌ నగర్‌లో యువతిని వివస్త్రను చేసిన సంఘటనపై నివేదిక పంపాలని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించింది. ఈ సంఘటనపై ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌ కోరింది.

తమ రాష్ట్రం కాని మహిళలపై చూపుతున్న ప్రేమ, సానుభూతిని, సొంత రాష్ట్రం మహిళలు, యువతులు, బాలికలపై చూపకపోవడమే బాధిస్తోంది.