
Balakrishna- YSR And Chandrababu: రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుది విలక్షణమైన శైలి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడంలో చంద్రబాబుకు మించిన సమర్థులు మరొకరు ఉండరు. ఏ ప్రభుత్వంలో అయినా తన పనులను క్షణాల్లో పూర్తి చేసుకోగల సమర్థత చంద్రబాబు సొంతం. దీనికి కారణం చంద్రబాబు లాబీయింగ్ టీమ్ గా చెబుతారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు, ఆయనకు కావాల్సిన వ్యక్తులకు ఏదైనా ముఖ్యమైన పని పడినప్పుడు క్షణాల్లో జరిగిపోతుంటుంది. అది ఎలా జరుగుతుందో అన్న విషయం ఇప్పటికీ చాలామందికి అర్థం కాని ప్రశ్న కాని ఉండిపోయింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి సినీ నటుడు ప్రస్తుత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం పెద్ద రచ్చకు కారణమైంది. ఈ వ్యవహారంలో బాలకృష్ణ బయటపడడం కష్టమే అని భావించారు. అయితే, కేసు నుంచి సులువుగానే బాలకృష్ణ బయటపడగలిగారు.
లాబీయింగ్ టీమ్ వలనే సాధ్యం..
నాటి రాజశేఖర్ రెడ్డి హయాంలో బాలకృష్ణ కాల్పులు వ్యవహారం సులువుగా మరుగున పడటానికి చంద్రబాబు నాయుడు లాబీయింగ్ టీమ్ కారణంగా చెబుతారు. ఈ వ్యవహారంలో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గాని, బాలకృష్ణ గాని కలిసింది లేదు. కానీ ఈ కేసు మాత్రం నీరుగారిపోయింది. చిన్నపాటి ఆరోగ్య సమస్య వల్ల ఇలా జరిగిందంటూ కేసును మూసేశారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు కు మధ్య ఉన్న వైరాన్ని బట్టి చూస్తే ఈ కేసు గట్టిగా బిగిచుకోవాల్సిందే. కానీ అందుకు విరుద్ధంగా కేసు నీరు గారి పోయింది. దీనికి కారణం రాజశేఖర్ రెడ్డి చనువుగా ఉండే కొందరు వ్యక్తులే కారణమని చెబుతుంటారు. అయితే వారంతా చంద్రబాబు నాయుడు లాబీయింగ్ టీమ్ అన్న ప్రచారము ఉంది. చంద్రబాబుకు చెందిన ఈ లాబీయింగ్ టీమ్ వల్లే నాడు బాలకృష్ణ ఈ కేసు నుంచి బయటపడగలిగారని చెబుతుంటారు.
మూడు స్థాయిల్లో లాబీయింగ్ బృందాలు..
చంద్రబాబు లాబీయింగ్ మూడు స్థాయిల్లో ఉంటుంది. అందుకు అనుగుణంగానే కొందరిని చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటారు. రాష్ట్రస్థాయిలో పనులకు కొందరైతే, జాతీయ స్థాయిలో పనులకు సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు లాబీయింగ్ చేస్తుంటారు. ఇంకా పై స్థాయిలో అయితే మరి కొంతమంది ప్రముఖులు ఉంటారు. ఒక్కోస్థాయిలో కనీసం ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు చంద్రబాబు నాయుడుకి అవసరమైన పనులు చేసి పెడుతుంటారు.

అదే తరహాలో చంద్రబాబు కూడా..
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే తరహాలో అవతల వ్యక్తులకు సహాయ, సహకారాలు అందిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్ధులు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో చూచి చూడనట్లు వ్యవహరించడానికి కారణం అవతల పక్కన ఉన్నటువంటి వ్యక్తులే అని చెబుతుంటారు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఈ తరహా లాబీయింగ్ చేసేందుకు కొంతమంది ఉంటారు. అయితే చంద్రబాబుది కాస్త బలమైన బృందంగానే చెప్పవచ్చు. అందుకే ఆయనకు కేంద్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా పనులు చకచకా జరిగిపోతుంటాయి.