
Meter Movie Trailer Review: రాజా వారు రాణి గారు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే చిత్రాలు కిరణ్ అబ్బవరంకి బ్రేక్ ఇచ్చాయి. అయితే ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసే సినిమా ఇంకా పడలేదు. దాంతో మనోడు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. గత ఏడాది మూడు సినిమాలు విడుదల చేశారు. 2023 ఫిబ్రవరిలో వినరో భాగ్యము విష్ణు కథ అంటూ డిఫరెంట్ సబ్జెక్టు తో వచ్చాడు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కినా… హిట్ స్టేటస్ అందుకోలేదు.
వినరో భాగ్యము విష్ణు కథ విడుదలై రెండు నెలలు కాకుండానే మరో మూవీతో ప్రేక్షకులు ముందు వచ్చారు. ఈసారి మీటర్ టైటిల్ తో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేశారు. మూవీ విడుదలకు సిద్ధం కాగా ప్రమోషన్స్ షురూ చేశారు నేడు మీటర్ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం సిన్సియర్ అండ్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.

స్టార్ హీరోలను పోలిన మాస్ మేనరిజమ్స్ ఫాలో అయ్యాడు కిరణ్ అబ్బవరం. దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలతో పాటు పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్ హోరెత్తించారు. లవ్, రొమాన్స్, యాక్షన్ ప్రధానంగా మీటర్ మూవీ తెరకెక్కించారు. పోలీస్ రోల్ లో కిరణ్ అబ్బవరం బాగానే సెట్ అయ్యాడు. కిరణ్ అబ్బవరం కి జంటగా అతుల్య రవి నటిస్తున్నారు. రొమాన్స్ పాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
రమేష్ కోడూరి కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అందించారు. చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంట్ చేయడం విశేషం. అది కలిసొచ్చే అంశం. ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా మీద అంచనాలు పెరిగాయి.