కరేబియన్ దీవుల్లో అంటిగ్వా,బార్బడోన్, డొమినికా,గ్రెనడా, సెయింట్ కిట్స్,సెయింట్ లూసియా చిన్న దేశాలు. ద్వితీయ పౌరసత్వం కావాలనుకున్న విదేశీయులకు ఇవి పెద్ద తివారీ పరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 150, 165 దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆ జాబితాలో ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఉండడం గమనార్హం. దీంతో భారత్ లో భారీ మోసాలకు పాల్పడ్డ నిందితులు అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ దేశ పౌరసత్వం పొందుతున్నారు.సరైన సమయం చూసుకుని అక్కడికి ఎగిరిపోతున్నారు. స్థానిక పౌరసత్వం ఉన్న కారణంగా వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది.
కరీబియన్ దేశాలు అనుసరిస్తున్న పెట్టుబడులతో పౌరసత్వం విధానం కింద 2014 నుంచి ఇప్పటివరకు 28 మంది భారతీయులు అంటిగ్వా పౌరసత్వం పొందేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అందులో 2017 జనవరి1 నుంచిజూన్ 30 వరకు2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఏడుగురికి పౌరసత్వం లభించింది. అంటిగ్వా2013లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా డిసెంబర్ 31,2019 నాటికి 2240 దరఖాస్తులు వచ్చాయి. అనేక మందికి ఆ దేశ పౌరసత్వం ఇచ్చింది.
కరీబియన్ దీవుల్లోని మరో దేశమైన సెయింట్ కిట్స్ 1983లో ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. స్వతంత్ర దేశమైన ఏడాది తర్వాత అంటే అంటిగ్వా కంటే ముందుగానే 1984లోనే ఈ వివాదాస్పదమైన పెయన్ సిటిజన్ షిప్ విధానాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో వీసాలు లేకుండా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తామని చెప్పడంతో బడా వ్యాపారస్తులు కొంత మొత్తంలో అక్కడపెట్టి పౌరసత్వం తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
కరీబియన్ దేశాల్లో పౌరసత్వం తీసుకోవడం చాలా తేలిక. దీంతో సెయింట్ లూసియా పౌరసత్వం పొందాలంటే ఒక లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే చాలు. ఆ వ్యక్తితో పాటు ఆయన భార్యకు కూడా పౌరసత్వం లభిస్తుంది. సెయింట్ లూసియానాో రూ.1.65 లక్షల డాలర్లు, నొమినిడాలో రూ.1.75 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ వెసులుబాటునే ఆయుధాలుగా చేసుకుని నేరగాళ్లు కరీబియన్ దీవులనే అడ్డాగా చేసుకుంటున్నారు.