మోడీకి దగ్గరవడానికే జగన్ వ్యూహం?

వైస్ జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే రాజకీయ వ్యూహాలేమీ లేకుండానే తన పని తాను కానిచ్చేస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం పట్టించుకోవడం లేదు. వారి విమర్శలను సైతం దగ్గరికి రానివ్వడం లేదు. అనుకున్న లక్ష్యం కోసం ముందుకు వెళుతున్నారు. మోడీకి ప్రీతిపాత్రంగా ఉంటున్నారే కాని అందుకు సరైన వ్యూహాలు అమలు చేయడం లేదు. రాజ్యసభ సభ్యత్వం అంబానీ సన్నిహితుడికి ఇవ్వడం వెనుక కూడా రాజకీయ వ్యూహమేది లేదు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికే తప్ప. మోడీ ప్రతిష్ట […]

Written By: Srinivas, Updated On : June 6, 2021 10:05 am
Follow us on

వైస్ జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే రాజకీయ వ్యూహాలేమీ లేకుండానే తన పని తాను కానిచ్చేస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం పట్టించుకోవడం లేదు. వారి విమర్శలను సైతం దగ్గరికి రానివ్వడం లేదు. అనుకున్న లక్ష్యం కోసం ముందుకు వెళుతున్నారు. మోడీకి ప్రీతిపాత్రంగా ఉంటున్నారే కాని అందుకు సరైన వ్యూహాలు అమలు చేయడం లేదు. రాజ్యసభ సభ్యత్వం అంబానీ సన్నిహితుడికి ఇవ్వడం వెనుక కూడా రాజకీయ వ్యూహమేది లేదు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికే తప్ప.

మోడీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. బెంగాల్ తోపాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఘోర పరాభవం దృష్ట్యా మోడీ చరిష్మా తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ రెండో దశ కట్టడిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దక్షిణాదిలో సైతం బీజేపీ అధికారం దక్కే అవకాశాలు లేయినా జగన్ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే క్రమంలో మద్దతు ప్రకటిస్తూ పనులు చేసుకుంటున్నారని భోగట్టా.

జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణను ఢీకొన్నారు. ఆయన ప్రస్తుతం చీఫ్ జస్టిస్ కావడంతో జగన్ లో భయం పుట్టుకుంది. మరో పక్క జగన్ బెయిల్ రద్దు చేయానే కేసును రఘురామ రాజు వేశారు. అది విచారణలో ఉంది. రాజకీయ నాయకుల అవినీతి కేసులు త్వరగా విచారించి క్లోజ్ చేయాలనే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.ఇలాంటి సందర్భంలో మోడీకి దగ్గర కావడం తప్ప మరో మార్గం లేదు.

గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ప్రధాని మోడీ కరోనా కట్టడిలో విపలమయ్యారని విమర్శిస్తూ ట్వీట్ చేయడంతో జగన్ తక్షణమే స్పందించి సోరేన్ ను విమర్శించారు. ఇంతకుముందు విజయసాయిరెడ్డికి ఢిల్లీ రాజకీయ వ్యూహాలు అప్పగించేవారు. ఇప్పుడు తానే స్వయంగా చూసుకుంటున్నారు. జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. మౌనంగా ఉండడం కన్నా వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.