
దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రెండు నెలల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు ఇంత తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా మరో 1,89,232 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 2,677 మంది వైరస్ బారినపడి మృతి చెందారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేవంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,09,339కు పెరిగాయి. ఇందులో 2,69,84,781 మంది బాధితులు కోలుకున్నారు.