Kerala : కేరళ సమాజమే ఓ విన్నత్నమైన సమాజం. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఘననీయంగా ఉన్న సమాజం. ఇది ఇప్పటిది కాదు. అనాదిగా అక్కడి సంస్కృతి వేరు. రాజుల కాలం నుంచి ఇక్కడ అందరి మతాలు ఎక్కువగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చాక హిందువుల జనాభా తగ్గింది. ముస్లింల జనాభా పెరిగింది.
కేరళలో సెక్యూలర్ సమాజం అని చెప్పుకునే వారంతా ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నారు. సీపీఎం కూడా ముస్లింలను అక్కున చేర్చుకొని సెక్యులర్ అని చెప్పుకుంటోంది. కేరళ కాంగ్రెస్ క్రిస్టియన్ల ప్రయోజనాల కోసం కాపాడుతోంది. బీజేపీ జాతీయ పార్టీ అయినా.. 9 ఏళ్లు పాలిస్తున్నా.. అది మతవాద పార్టీ, హిందుత్వ పార్టీ, అంటరాని పార్టీ అంటున్నాయి. కేరళలోని అన్ని పార్టీలు కలిపి ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
హిందూ మనోభావాలు దెబ్బతీయడంలో కేరళ సీపీఎం ప్రభుత్వం ముందుంది. శబరిమల వివాదం పెద్దదిగా చేసింది. దేవాలయాల ముందు కాషాయ జెండా కట్టకూడదని జీవో జారీ చేసిన కేరళ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రెండోసారి సీపీఎం ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది.
శబరిమలై వివాదం తర్వాత కేరళలో మరో వివాదం రాజుకుంది. కేరళ స్పీకర్ షమీర్ మన హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనిషికి ఏనుగు తల అతికించారని.. గణేష్ దేవుడిని టార్గెట్ చేశారు. ఇప్పుడీ వివాదం తీవ్ర దుమారం రేపింది.
దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..