Annamalai : బీజేపీ దక్షిణ భారత నాయకుడుగా ఎదుగుతున్న అన్నామలై

బీజేపీ దక్షిణ భారత నాయకుడుగా ఎదుగుతున్న అన్నామలై తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 22, 2023 4:20 pm

Annamalai : అన్నామలై నిన్న హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేశారు. రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం.. ప్రతికా సమావేశం నిర్వహించారు. శేర్ లింగంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లలో ప్రచారం చేశారు. శేర్ లింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో మాట్లాడి రోడ్ షో చేశారు. ఇక కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి తమిళ మూలాలున్న శ్రీగణేషన్ కావడంతో అతడి కోసం ప్రచారం చేశారు. తమిళులు అక్కడ బాగా ఉండడంతో అక్కడ ప్రచారం చేశారు.

అన్నామలై నిర్వహించిన విలేకరుల సమావేశం ఆకట్టుకుంది. స్పష్టంగా క్లారిటీగా సమాధానమిచ్చారు. తెలంగాణలో కుటుంబ పాలన ఏ విధంగా నాశనం చేస్తుందన్నది వివరించారు. తమిళనాడు, తెలంగాణలో కుటుంబ పాలనల పోలికలను వివరించారు.

తమిళనాడులో ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఉందని.. తెలంగాణలో ఆరున్నర లక్షల కోట్ల అప్పు ఉందని ఉదాహరణలతో వివరించారు. అవినీతిని, కుటుంబ పాలనను లింక్ చేసి చక్కగా వివరించారు. కుటుంబ పాలన ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి విచ్చలవిడిగా ఉంటుందని లింక్ చేసి మరీ వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కుటుంబ పార్టీల తీరును ఎండగట్టారు.

బీజేపీ దక్షిణ భారత నాయకుడుగా ఎదుగుతున్న అన్నామలై తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.