Tollywood Directors: మన స్టార్ డైరెక్టర్లు వాళ్ల సినిమాల్లో ఈ నటులను రిపీట్ చేయడం వెనుక కారణం ఇదేనా..?

పూరీజగన్నాథ్ సినిమాల్లో మొదటి నుంచి కూడా అలీ అన్ని సినిమాల్లో చేస్తూ వచ్చాడు ఆయన కోసం సపరేట్ గా ఒక కామెడీ ట్రాక్ కూడా రాస్తానని పూరి జగన్నాథ్ చాలాసార్లు చెప్పారు...ఇక నటుడు సుబ్బరాజ్ కూడా పూరి సినిమాల్లో ఎక్కువ గా కనిపిస్తూ ఉంటాడు.

Written By: Gopi, Updated On : November 22, 2023 3:43 pm

Tollywood Directors

Follow us on

Tollywood Directors: తెలుగు సినిమా డైరెక్టర్లలో చాలామంది చాలా సినిమాలు చేసి సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు.అలాగే ఫెయిల్యూర్ అందుకున్న వాళ్ళు ఉన్నారు.ఇక సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఇక్కడ కామన్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది…ఇక ఇది ఇలా ఉంటే చాలా మంది డైరెక్టర్లు వాళ్ల సినిమాల్లో కొంతమంది నటులను కావాలని మరీ పెట్టుకుంటూ ఉంటారు.వాళ్లకి ఇంతకుముందు వాళ్లతో ఉన్న బాండింగ్ వల్లనే వాళ్ళని అలా వాళ్ల సినిమాల్లో పెట్టుకుంటు ఉంటారని తెలుస్తుంది… అయితే మన తెలుగు సినిమా డైరెక్టర్లలో ఎక్కువ గా రిపీట్ అయ్యే నటులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం…

పూరీజగన్నాథ్
పూరీజగన్నాథ్ సినిమాల్లో మొదటి నుంచి కూడా అలీ అన్ని సినిమాల్లో చేస్తూ వచ్చాడు ఆయన కోసం సపరేట్ గా ఒక కామెడీ ట్రాక్ కూడా రాస్తానని పూరి జగన్నాథ్ చాలాసార్లు చెప్పారు…ఇక నటుడు సుబ్బరాజ్ కూడా పూరి సినిమాల్లో ఎక్కువ గా కనిపిస్తూ ఉంటాడు…

త్రివిక్రమ్
త్రివిక్రమ్ సినిమాల్లో మొదటి నుంచి కూడా సునీల్ ఎక్కువ గా కనిపిస్తూ వచ్చేవాడు.ఆయన ఏ స్టోరీ రాసిన త్రివిక్రమ్ తన ఫ్రెండ్ కావడం వల్ల అతను కోసం ఒక క్యారెక్టర్ రాసి ఆయనతో చేపించేవాడు…అలాగే నటుడు గిరి, ప్రభులను కూడా ఆయన సినిమాల్లో ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు…

బోయపాటి శ్రీను
ఇక బోయపాటి శ్రీను సినిమాల్లో చలపతి రావు బతికి ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా కనిపించేవారు, అలాగే ఆయనతో పాటు నటుడు శ్రావణ్ కూడా ఎక్కువగా ఆయన సినిమాల్లో విలన్ గా కనిపిస్తాడు. ఇక ఆయన పేరు కూడా బోయపాటి శ్రావణ్ అని పెట్టారు…

రాజమౌళి
రాజమౌళి సినిమాల్లో మొదటి నుంచి కూడా ఛత్రపతి శేఖర్ అలాగే రాజీవ్ కనకాల చాలా ఎక్కువ గా కనిపిస్తూ ఉంటారు. రాజమౌళి తీసిన 90% సినిమాల్లో వీళ్ళు నటించారు.

ఇలా చాలా మంది నటులను మన డైరెక్టర్లు రిపీట్ చేస్తూ ఉంటారు…నిజానికి దర్శకులు అయ్యే కంటే ముందు నుంచి కూడా వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిపీట్ చేస్తారు. అలాగే మరి కొందరు మాత్రం కొంత మంది నటులతో చేశాక వాళ్ళకి మంచి బాండింగ్ ఏర్పడి వాళ్ళతో అయితే మన క్యారెక్టర్ ని మనం ఎలా అనుకున్నమో అలా చేయించుకోవచ్చు అని అనుకొని వల్లనే ఎక్కువ గా రిపీట్ చేస్తారు…