Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో హత్య జరిగింది. చనిపోయింది మిసెస్ బిగ్ బాస్ అంటూ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో తనకి ఒక భర్య ఉందంటూ .. ఆమె మీ అందరికీ లంచ్ పార్టీ ఏర్పాటు చేసింది. అని కంటెస్టెంట్స్ కి బిర్యానీ పంపించారు. హౌస్ మేట్స్ బిర్యానీ తిని బయటకు వచ్చాక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో దారుణమైన హత్య జరిగింది. చనిపోయింది ఎవరో కాదు మిసెస్ బిగ్ బాస్ అని చెప్పారు.
ఇక హౌస్ మొత్తం కేసు చేధించే పనిలో పడ్డారు. ఈ టాస్క్ లో అమర్ దీప్, అర్జున్ పోలీసులు గా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రోమోలో అర్జున్ మేము కేసు ఛేదించడానికి వచ్చాము. నేను ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ .. అతను కానిస్టేబుల్ కాంజిత్ అనేసరికి కానిస్టేబుల్ కాదు .. మీతో పాటు నన్ను కూడా ఎస్ ఐ అనే చెప్పారక్కడ అంటూ ఫన్నీ గా చెప్పాడు. ఇక అశ్విని, శోభా న్యూస్ రిపోర్ట్స్ .. బ్రేకింగ్ న్యూస్ కోసం ఇద్దరు పోటీ పడాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు.
రతిక ఏమో ..బిగ్ బాస్ వైఫ్ కార్ డ్రైవర్ గా .. గౌతమ్ వంటవాడిగా చేస్తున్నారు. అయితే వీళ్లద్దరి మధ్య ఎఫైర్ .. ‘ నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఇట్లా కన్ను కొడతా.. నువ్వు పక్కకి వచ్చెయ్ అని గౌతమ్ తో రతిక చెప్తుంది. ఏయ్ భలే కొట్టినవ్ అని గౌతమ్ అంటాడు. ఇక బిగ్ బాస్ మిసెస్ కి గుమస్తాగా శివాజీ కనిపించాడు. యావర్, ప్రియాంక లు పనోళ్ళుగా తమ పాత్రల్లో నటిస్తూ .. మేడం చనిపోయిందంటూ తెగ ఏడ్చేశారు.
‘ యావరు .. మరీ ఓవర్ గా ఉంది.. అంత ఏడవకండి రా ‘ అని శివాజీ అంటే పోయింది మా మేడం కదా .. ఆ మాత్రం ఫీలింగ్ ఉండదా అని ప్రియాంక అన్నది. నాకేమైనా పెళ్ళామా .. నాకు కూడా మేడమే అంటూ శివాజీ పంచ్ వేసాడు. తర్వాత శివాజీ , ప్రశాంత్ ని కన్ఫెషన్ రూంలో కి పిలిచాడు బిగ్ బాస్. అయితే శివాజీ కి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్ అయ్యేందుకు ఈ టాస్క్ కీలకం కానుంది.
