Animal Trailer Review: వామ్మో రణబీర్ కపూర్ మామూలోడు కాదు.. యానిమల్ ట్రైలర్ అదరగొట్టేశాడు

బుధవారం సెన్సార్ పూర్తి చేసుకొని, సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ పొందింది. రన్ టైమ్ కూడా ఆశ్చర్యపోయేలా ఉండడంతో.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో స్క్రీనింగ్ చేయగా చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు చూసి ట్రెమండస్ రివ్యూలు ఇచ్చారు.

Written By: Suresh, Updated On : November 23, 2023 5:40 pm

Animal

Follow us on

Animal Trailer Review: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమా మామూలుగా ఉండదనేలా ఫీల్ ని ఇవ్వడంతో దేశ ప్రజలంతా ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేశాయి. అయితే రా అండ్ రస్టిక్ యాక్షన్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా.. నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ ను సంపాదించి యానిమల్ సినిమా కొత్త రికార్డును సృష్టించింది.

బుధవారం సెన్సార్ పూర్తి చేసుకొని, సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ పొందింది. రన్ టైమ్ కూడా ఆశ్చర్యపోయేలా ఉండడంతో.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో స్క్రీనింగ్ చేయగా చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు చూసి ట్రెమండస్ రివ్యూలు ఇచ్చారు. రణబీర్ కపూర్ విశ్వరూపం చూస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలు, పోస్టులు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఈ ట్రైలర్ కూడా ట్రెండింగ్ లో టాప్ లో దూసుకొని వెళ్తుంది.

ఇంతకు ముందే రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాలో ఏం ఉండబోతుందో చుఛాయగా చెప్పగా యావత్ దేశం దాన్ని థ్రిల్ ఫీలైంది. హాలీవుడ్ జాన్ విక్ టైప్ లో ఈ యానిమల్ తీర్చిదిద్దామని, యాక్షన్ సీన్స్ మరో లెవల్లో ఉంటాయన్నట్టుగా హైప్ తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన ట్రైలర్.. టీజర్ ను మించి గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. 3 నిమిషాల 32 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో రణబీర్ ను దర్శకుడు ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అన్నట్టుగా చూపించారు.

ఓట్ అండ్ ఓట్ యాక్షన్ తో పాటు తండ్రి సెంటిమెంట్ ను బాగా వాడినట్లు తెలుస్తోంది. తండ్రికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కొడుకు పగ తీర్చుకోవడం చుట్టూ కథను నడిపించినట్టుగా ట్రైలర్ ను కట్ చేశారు. ఇక చివరలో వచ్చే గన్ ఫైర్ మాత్రం మరో స్థాయిలో ఉంది. ఖైదీ, కేజీఎఫ్ గున్నులను మించిన గన్నును ఈ సినిమాలో వాడారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆకలి తీర్చే విధంగా ఈ ట్రైలర్ ఉంది. ఇక సినిమాపై ఆకాశమే హద్దు అన్నట్టుగా అంచనాలు పెంచేశారు మేకర్స్.