https://oktelugu.com/

Adityanath’s Regime : గ్రేటర్ నోయిడా ప్రాంతం మరో మహానగరంగా రూపాంతరం

నొయిడా, గ్రేటర్ నొయిడా అర్భన్ డెవలప్ మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలో 124 ప్రాజెక్టులకుగాను రూ.1,719 కోట్లు కేటాయించారు. ఇందులో కొన్ని ప్రాజెక్టుల పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని ప్రారంభించిన యోగి.. మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2023 / 08:51 AM IST
    Follow us on

    Adityanath’s Regime  : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడు మీద ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న గ్యాంగ్ స్టర్స్ ను ఏరివేసే పనిలో పడ్డారు. విపక్షాల నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అభివృద్ధి పనులతో పరుగుపెట్టిస్తున్నారు. వందలాది ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. వాటిని పూర్తిచేసే పనిలో పడ్డారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తిచేశారు.నోయిడా స్టేడియంలో వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు.

    నొయిడా, గ్రేటర్ నొయిడా అర్భన్ డెవలప్ మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలో 124 ప్రాజెక్టులకుగాను రూ.1,719 కోట్లు కేటాయించారు. ఇందులో కొన్ని ప్రాజెక్టుల పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని ప్రారంభించిన యోగి.. మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా పార్థాల ఫ్లైఓవర్ ను ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రత్యేకమైనది. కేబుల్ బ్రిడ్జి తరహాలో ఉంటుంది. నొయిడా నుంచి గ్రేటర్ వరకూ ఎంపీ 3 రహదారిని కలుపుతూ ఉన్న ఈ వంతెన ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జి తరహాలో ఉంటుంది. 650 మీటర్ల పొడవు ఉండే వంతెన.. క్యారేజ్ వేకు ఇరువైపులా 28 వైర్లతో నిర్మించారు. 12 ఎకరాల్లో రూ.22.68 కోట్లతో నిర్మించిన వేద్ వాన్ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

    వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలో ‘సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన మరొక కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్..మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. మన సంస్కృతిపై ఏదైనా దాడి జరిగినా లేదా జరుగుతున్నా, అది డిజిటల్ మీడియా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా అయినా, దాని విధానం మారిందని యోగీ తెలిపారు. ఆ పద్ధతులను మనం అర్థం చేసుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్ డేట్ కావాలన్నారు. అందుకు మనకు మనం సంసిద్ధులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకేసారి కీలక 124 ప్రాజెక్టులకు యోగి శ్రీకారం చుట్టడంపై విపక్షాలకు సైతం మిుంగడుపడడం లేదు. అవి నిశితంగా పరిశీలిస్తున్నాయి.

    ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న అభివృద్ధిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..