https://oktelugu.com/

Deepthi Sunaina: బెడ్ పై బోర్లా పడుకుని విరహ వేదన అనుభవిస్తున్న దీప్తి సునైన… ఒంటరితనం వలనేనా ఈ బాధలు!

ఒకరిని వదిలి మరొకరు ఉండలేం అన్నంతగా ప్రవర్తించారు. ఇదంతా బయట నుండి గమనించిన దీప్తి బాధపడింది. తనతో రిలేషన్ లో ఉండి మరొక అమ్మాయితో రొమాన్స్ చేసినందుకు ఆమె మానసిక వేదనకు గురైంది. షణ్ముఖ్ హౌస్లో ఉండగా బ్రేకప్ ప్రకటిస్తే అతని మీద నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. అందుకే షో ముగిశాక దీప్తి బ్రేకప్ చెప్పింది. సీజన్ 5 రన్నర్ గా షణ్ముఖ్ నిలిచాడు. ఇక ఒకటి రెండు సందర్భాల్లో షణ్ముఖ్ కి దగ్గరై తప్పు చేసినట్లు సిరి ఒప్పుకుంది. ఆమెకు కూడా లవర్ ఉన్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2023 / 08:41 AM IST

    Deepthi Sunaina

    Follow us on

    Deepthi Sunaina: దీప్తి సునైన ఇప్పుడు ఒంటరి. ఆమె ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోయి చాలా కాలం అవుతుంది. 2021 చివర్లో దీప్తి సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ ప్రకటన చేసింది. షణ్ముఖ్ తో విడిపోతున్నానని అధికారిక ప్రకటన చేసింది. యూట్యూబర్స్ గా దీప్తి సునైన, షణ్ముఖ్ కెరీర్ మొదలైంది. అక్కడే వీరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక ప్రాజెక్ట్స్ చేశారు. దీప్తి-షణ్ముఖ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, సాంగ్ ఆల్బమ్స్ మంచి ఆదరణ పొందాయి. లక్షల వ్యూస్ రాబట్టాయి.

    బెస్ట్ యూట్యూబ్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డారు. తమ రిలేషన్ ని ఓపెన్ గా చెప్పుకున్నారు. చాలా కాలం ప్రేమికులుగా ఉన్న ఈ జంట మధ్య బిగ్ బాస్ మంట పెట్టింది. షణ్ముఖ్ చేసిన ఓ తప్పు దీప్తి మనసు ముక్కలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో ప్రేమాయణం నడిపాడు. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ కెమెరాల ముందు సిరి-షణ్ముఖ్ విచ్చల విడి రొమాన్స్ చేశారు.

    ఒకరిని వదిలి మరొకరు ఉండలేం అన్నంతగా ప్రవర్తించారు. ఇదంతా బయట నుండి గమనించిన దీప్తి బాధపడింది. తనతో రిలేషన్ లో ఉండి మరొక అమ్మాయితో రొమాన్స్ చేసినందుకు ఆమె మానసిక వేదనకు గురైంది. షణ్ముఖ్ హౌస్లో ఉండగా బ్రేకప్ ప్రకటిస్తే అతని మీద నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. అందుకే షో ముగిశాక దీప్తి బ్రేకప్ చెప్పింది. సీజన్ 5 రన్నర్ గా షణ్ముఖ్ నిలిచాడు. ఇక ఒకటి రెండు సందర్భాల్లో షణ్ముఖ్ కి దగ్గరై తప్పు చేసినట్లు సిరి ఒప్పుకుంది. ఆమెకు కూడా లవర్ ఉన్నాడు.

    ఇటీవల షణ్ముఖ్-దీప్తి కలిసిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. జంటగా కొన్ని ఈవెంట్స్ చేసిన క్రమంలో కాంప్రమైజ్ అయ్యారని వార్తలు వచ్చాయి. అవి ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. షణ్ముఖ్, దీప్తి ఎవరి దారిన వారున్నారు. ఇక దీప్తి ఇంస్టాగ్రామ్ వేదిక తన గ్లామర్ చూపిస్తూ షణ్ముఖ్ ని రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా బెడ్ పై బోర్లా పడుకుని విరహ వేదన అనుభవించింది. దీప్తి ఫోజు చూసిన జనాలు తోడు లేక విరహ వేదన అనుభవిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.