Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. దసరాలోపు దీని షూటింగ్ పూర్తి చేయడానికి వడివడిగా ముందుకెళుతున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయ భగత్ సింగ్’ మూవీ.. ఇక సముద్రఖని దర్శకత్వంలో సాయిధరమ్ తో మరో మూవీని ఈ ఏడాదిలోపు పూర్తి చేయనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఈ మధ్యే మొదలై.. మళ్లీ ఆగిపోయింది. భారీ బడ్డెట్ తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే 60శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ వేసవిలో గ్రాఫిక్స్ పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న రిలీజ్ కు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీ, తెలుగు, దక్షిణాది భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

హరిహర వీరమల్లు మూవీ మరో ట్రైలర్ ను డిసెంబర్ 31న కొత్త సంవత్సరం కానుకంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇది అదిరిపోయే అప్డేట్ అని.. పవన్ ఫ్యాన్స్ ఖుషీ కావడం గ్యారెటీ అంటున్నారు.
ఇక ఇటీవలే ఈ చిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ ‘టిప్స్’ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్ ద్వారా బాగా లాభాలు వచ్చాయని అంటున్నారు.