Analysis On KCR Kaleshwaram Project కేసీఆర్ .. ఇంకో నాటకానికి తెరతీశారు. మొన్న విదేశీ కుట్ర ఉందని చెప్పి.. కాళేశ్వరం వైఫల్యాన్ని ఏ విధంగా అయితే పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేశాడో..ఇవాళ అది కూడా క్లిక్ కాలేదని.. కొత్త నాటకం మొదలుపెట్టారు. భద్రాచలం వరదకు పోలవరం డ్యామ్ కారణం అని ప్రచారం మొదలుపెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ చేత ఈ వాదన తీసుకొచ్చారు.

టీవీ9 రజినీకాంత్ దీన్ని ఏజెండాగా తీసుకొని కేసీఆర్ కు వంతపాడుతున్నారు.కేసీఆర్ తెలంగాణలో వరదలకు క్లౌడ్ బరెస్ట్ అంటూ విదేశీ కుట్ర అనడం జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. అందుకే కాళేశ్వరం వైఫల్యంను కప్పిపుచ్చుకోవడానికి కొత్త నాటకం మొదలుపెట్టారు.
ఇక పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించాలని.. పోలవరం ముంపు గ్రామాలను తిరిగి ఇవ్వాలని.. మండలాలను కూడా వెనక్కి ఇవ్వాలని కేసీఆర్ అండ్ కో , అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తోంది. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేసీఆర్ ఈ రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మునిగిన కాళేశ్వరంను పక్కదారి పట్టించడానికి భద్రాచలం వరద గురించి మాట్లాడడం కేసీఆర్ సమస్యను డైవర్ట్ చేయడం కోసం.. వైఫల్యాలను కప్పిపుచ్చడం కోసమే ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి టీవీ9 సహా చాలా మీడియాలు సపోర్టు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
