BundelKhand Expressway ఒకటి కాదు.. రెండు కాదు.. 14850 కోట్ల రూపాయిలు.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పై అవాజ్య ప్రేమతో జాతీయ నిధులు తీసుకొచ్చి మరీ మన కేంద్రంలోని మోడీ సర్కార్ ‘బుందేల్ ఖండ్’కు ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించింది. కేంద్రంలోని బీజేపీని నిలబెట్టిన ఈ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతానికి అన్ని కోట్ల నిధులు కేటాయించడాన్ని బీజేపీ సమర్తించుకున్నా.. మిగతా పేద రాష్ట్రాలు మాత్రం మోడీ సర్కార్ సవతి ప్రేమపై ఆడిపోసుకున్నాయి.

ఏది ఏమైతేనే.. 14వేల కోట్లను పెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ జాతీయ రహదారిని ప్రధాని జస్ట్ 5 రోజుల క్రితమే ప్రారంభించారు. కట్ చేస్తే ఆ రహదారి ప్రారంభించిన 5 రోజులకే పెద్ద గుంతలు పడి కుప్పకూలిపోయింది. భూమిలోకి కుంగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇది చూసి ‘ఇదేంటి మోడీజీ.. అన్ని వేల కోట్లు పెట్టి ఇలా చేశారేంటి?’ అని ఆ ఫొటోలు వీడియోలు షేర్ చేసి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ఈ జాతీయ రహదారికి వేల కోట్ల రూపాయలు ధారపోసినా కూడా మన దేశంలో రోడ్లు మాత్రం నాణ్యతగా చేయడం కల్లా అని తేలిపోయింది. ఏపీ లాంటి రాష్ట్రాలు ఒక్క జాతీయ రహదారి మంజూరు చేయాలంటూ నెత్తినోరు బాదుకుంటున్నా మీనమేషాలు లెక్కిస్తున్న మోడీ సర్కార్.. తమను గెలిపించే రాష్ట్రాలకు మాత్రం దోచిపెడుతోందన్న విమర్శలను తెచ్చుకుంటోంది.
మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన బుందేల్ ఖండ్ జాతీయరహదారి మోడీ ప్రారంభించిన 5 రోజులకే కుప్పకూలి కుంగిపోవడం చర్చనీయాంశమైంది. జాతీయ రహదారుల నిర్మాణంలోనూ ఇంత నాసిరకంగా వేశారంటే మోడీ సర్కార్ పనితనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చగా మారింది. ప్రధాని మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తి ప్రారంభించిన రోడ్ల దుస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రాల రోడ్ల పరిస్థితి ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ‘బుందేల్ ఖండ్’లో కేంద్రప్రభుత్వం ఎక్స్ ప్రెస్ వేను నిర్మించింది. ఈ రోడ్డుతో బుందేల్ ఖండ్ దశ మారుతుందని గొప్పగా చెప్పారు మోడీ. ఐదు రోజుల క్రితం జాతికి అంకితం చేశారు.
కానీ ఇటీవల కురిసిన వర్షాలకు బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవే కొట్టుకుపోయింది. వరద నీరు పొంగి జాతీయ రహదారిని ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయేలా చేసింది. రోడ్డు మధ్యలో మొత్తం కట్ అయిపోయి పెద్ద గుంత ఏర్పడింది.
మోడీ ప్రారంభించిన 5 రోజులకే జాతీయ ఎక్స్ ప్రెస్ హైవే కొట్టుకుపోయిందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు షేర్లు చేస్తూ మోడీ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు. ప్రచారం కోసం మోడీ ప్రారంభించారని.. తాజా వర్షాలు మోడీ సర్కార్ పనితనాన్ని బట్టబయలు చేశాయని సమాజ్ వాది పార్టీ మరో వీడియోను పోస్ట్ చేసింది.