Pawan Kalyan Ramcharan: #RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్షే షనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తన 50 వ చిత్రం గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..ఇప్పటికే 70 శాతం వరుకు తాకి పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..ఈ చిత్రం లో రామ్ చరణ్ కి జోడి గా కైరా అద్వానీ , అంజలి హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే..ఇంకా టైటిల్ కూడా ఖరారు కానీ ఈ చిత్రానికి మార్కెట్ లో అప్పుడే విపరీతమైన బజ్ ఏర్పడడం విశేషం..అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు మూవీ టీం..

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..అందులో ఒకటి మోడరన్ రోజుల్లో ఉన్న రామ్ చరణ్ కి తండ్రి పాత్ర..ఈ పాత్ర కి సంబంధించిన లుక్ ఇప్పటికే సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..అయితే ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారక్టర్ ఉంటుందట..ఆయన వీరోచిత పోరాటాన్ని స్ఫూర్తి గా తీసుకొని రామ్ చరణ్ అదే బాటలో పయనిస్తాడట..ఆ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సంప్రదించారట శంకర్..ఈ పాత్రకి మీరు అయితేనే సరైన న్యాయం చేయగలరని..కేవలం వారం రోజుల కాల్ షీట్స్ సరిపోతాయని అడిగారట.. పవన్ కళ్యాణ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..త్వరలోనే ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించబోతున్నాడట శంకర్..
ఇదే కనుక కార్యరూపం దాలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర విస్ఫోటనమే అని చెప్పొచ్చు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికి తెలిసిందే.. ఆయనని నేతాజీ లాంటి లెజెండ్ పాత్రలో చూడడం అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ అంటేనే పెద్ద సెన్సేషన్..వారికి తోడుగా పవర్ స్టార్ కూడా తోడు అయితే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.