https://oktelugu.com/

Ayodhya Ram Temple : ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ కోణం నుంచి అయోధ్య రామాలయంపై విశ్లేషణ

ముస్లింలు మక్కాకు వెళుతారు.. క్రిస్టియన్ లు జెరూసలెం వెళతారు.. హిందువులకు ప్రధాన తీర్థయాత్రల్లో మధుర, కాశీతోపాటు అయోధ్య. అయోధ్యలో సింబాలిక్ గా కూడా రామజన్మభూమి ఆలయం అక్కడ లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2023 12:32 pm

    Ayodhya Ram Temple : అయోధ్య రామాలయం.. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్.. రామజన్మభూమిలో ఉన్న రామాలయాన్ని కూల్చి మసీదు దగ్గర నుంచి ఇది వివాదమైంది. రాముడు ఆరాధ్య దేవుడు.. ప్రతీ హిందూ గుండెల్లో మనసులో ఉన్న దేవుడు. శ్రీరాముడు అంటే తెలియని హిందువులు ఉండరు.. ఆయన గురించి అనుభూతి పొందని వారు ఉండరు..

    అసలు దేవాలయాలు ఎందుకు కూల్చారంటే.. బాబర్ దేశానికి చక్రవర్తి అయ్యాక చాలా దేవాలయాలు కూల్చాడు. ఇస్లాం మతంలో విగ్రహారాధనకు వ్యతిరేకం. అదొక్కటే కాదు.. ఇస్లాం మతం.. ఇతర మతాల విషయంలో వైలెంట్ గా వ్యవహరించింది. హిందూ దేశాన్ని జయించాలంటే.. వీళ్లకు అత్యంత విశ్వాసం ఉన్న దేవుళ్లను కూల్చి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయాలని ఇలా చేశారు. ఇక మూడోది దేవాలయాల కింద ఉన్న సంపద దోచుకెళ్లడానికి కూడా ఇస్లాం రాజులు ఇలా కూల్చేశారు.

    హిందువులు ఎక్కువగా అనుబంధం పెంచుకుంది మూడే మూడు.. అయోధ్య రామాలయం.. కృష్ణుడి విషయంలో.. మూడోది కాశీ విశ్వనాథుడు.. ఈ మూడు దేవాలయాలపై హిందువులకు ఆరాధ్య దైవంగా ఉంది. కృష్ణుడు, కాశీలో ఆలయాలు కూల్చినా తర్వాత ఏర్పాటు చేశారు. కానీ అయోధ్యలో మాత్రం కొన్ని సంవత్సరాలుగా హిందూ ఆలయం ఏర్పాటు కాలేదు.

    ముస్లింలు మక్కాకు వెళుతారు.. క్రిస్టియన్ లు జెరూసలెం వెళతారు.. హిందువులకు ప్రధాన తీర్థయాత్రల్లో మధుర, కాశీతోపాటు అయోధ్య. అయోధ్యలో సింబాలిక్ గా కూడా రామజన్మభూమి ఆలయం అక్కడ లేదు.

    ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ కోణం నుంచి అయోధ్య రామాలయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ కోణం నుంచి అయోధ్య రామాలయంపై విశ్లేషణ || Ayodhya Ram Temple || Ram Talk