Youtuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు బంపర్ ఆఫర్.. ఏకంగా ఎన్ని సినిమాల్లో ఆఫర్ వచ్చిందో తెలుసా?

ఎమ్మెల్యే కొడుకు హీరో, ఎంపీ కొడుకు హీరో, ప్రొడ్యూసర్ కొడుకు హీరో, డైరెక్టర్ కొడుకు హీరో, యాక్టర్ కొడుకు, హీరో కొడుకు, హీరోయిన్ కొడుకు, విలన్ కొడుకు, ఆఖరికి యాంకర్ కొడుకు కూడా హీరోనే అయ్యాడు.

Written By: Suresh, Updated On : November 3, 2023 12:05 pm

Youtuber Anvesh

Follow us on

Youtuber Anvesh: అన్వేషణ అనే పదం ఏదో వింత అనుభూతిని కలిగిస్తుంది. ఇక అన్వేషించే వాళ్లను చూస్తే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందులో మన యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు చిన్న చిన్న వీడియోలు చేసేవారు. ట్రావెలర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈ అన్వేషకుడు తెలుగులోనే నెంబర్ వన్ ట్రావెల్ యూట్యూబర్ గా అవతారమెత్తారు. ఏకంగా 167 దేశాలు చుట్టి రికార్డు సృష్టించారు. దీంతో ఈయనకు ఏకంగా 20లక్షలకు పైగా సబ్ స్కైబర్స్ ఉన్నారు. ఇలా నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా సంపాదిస్తూనే అభిమానులను ఆకట్టుకుంటూ ఆయన అమాంతం క్రేజ్ పెంచేసుకున్నారు.

ఇదిలా ఉంటే అన్వేష్ కు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయట. రీసెంట్ గానే పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చాయని టాక్. కానీ ఈయన వాటిని తిరస్కరించారట. ఈ విషయాన్ని స్వయంగా అన్వేష్ చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన అన్వేష్ అందులో భలే ఫన్నీగా మాట్లాడారు కూడా. కాదండి మనలో మన మాట నేను హీరోను ఏంటండి? పది అవకాశాలు వచ్చాయండి హీరో అవమని.. నాకు తెలియక అడుగుతాను మీకు హీరో అంతంగా కావాలంటే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి పది మంది ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఓ పది మంది ఉన్నారు. ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి కూడా ఓ పది మంది ఉన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఉన్నారు.

ఎమ్మెల్యే కొడుకు హీరో, ఎంపీ కొడుకు హీరో, ప్రొడ్యూసర్ కొడుకు హీరో, డైరెక్టర్ కొడుకు హీరో, యాక్టర్ కొడుకు, హీరో కొడుకు, హీరోయిన్ కొడుకు, విలన్ కొడుకు, ఆఖరికి యాంకర్ కొడుకు కూడా హీరోనే అయ్యాడు. తెలుగులో 4398 మంది హీరోలు ఉన్నారు. పాతవాళ్లు కొత్తవాళ్లు కలిపి.. ఇంత మందిని వదిలేసిన నన్ను హీరో అంటే? అని మాట్లాడారు అన్వేష్.

నా మొహం ఎప్పుడైనా అద్దంలో చూశారా? నాకు తెలియక అడుగుతాను నెత్తి మీద మూడు ఈకలు ఉంటాయి. ఐదు నెలల ప్రెగ్నెంట్ కు ఉన్నంత బొజ్జ ఉంటుంది. భూమికి మూడు అడుగులు ఉంటాను. మాటలు నత్తి ఉంటాయి. నేను హీరో అంటే నమ్మడానికి ఎలా ఉంటుంది. మీరే ఆలోచించండి అని అడిగారు అన్వేష్. ఇదిలా ఉంటే ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయినా సినిమా ఆఫర్లు కాదంటున్న మీరు గ్రేట్ అంటున్నారు కొందరు. మరికొందరు ఒప్పుకో అన్నా అని సలహాలు ఇస్తున్నారు.