CM Jagan : జనం వ్యతిరేకత MLA ల మీద కాదు, జగన్ మీదనే

జనం వ్యతిరేకత MLAల మీద కాదు, జగన్ మీదనే ఉంది.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 13, 2024 12:10 pm

CM Jagan : జగన్ మోహన్ రెడ్డి కొత్త ట్రెండ్ ఏంటంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారిని పెట్టడం.. ఇటీవల ఏపీలో జగన్ చేస్తున్న మార్పులు ఒక ట్రెండ్ సెట్టర్ గా మారాయి. ఇప్పటికి మూడు లిస్టులు రెడీ చేశారు. ఇంకా ఎంత మందిని మారుస్తాడో తెలియదు..

ఇదంతా ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతోందని క్లియర్ కట్ గా తెలుసుకున్నారు. దాన్ని నివారించడం కోసం అని చెప్పి ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. అలా వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తున్నారు.

అయితే ఎక్కడ పప్పులో కాలేసాడంటే.. వ్యతిరేకత ఎమ్మెల్యేల మీదనే కాదు.. అసలు వ్యతిరేకత జగన్ మీద.. జగన్ అండ్ కో మీద ఉంది. ఎమ్మెల్యేల మీద కూడా కొంచెం ఉంది. ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రం జగన్ ఓడిపోడు అన్నది లేదు. జనం మొత్తం జగన్ చర్యల పైనే ఫోకస్ చేస్తున్నారు.

ఐదేళ్లలో ఏపీకి రాజధాని కట్టకపోవడం.. గుంతల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ దే. రౌడీ సంస్కృతిని పెంచి పోషించింది జగన్ నే.. ఈ ఐదేళ్లలో సున్నా అభివృద్ధిని చూపించింది జగన్ దే.. అవినీతిలో అందలమెక్కించిన ఘనత జగన్ దే.. సొంత బాబాయిని చంపిన నేరస్థులను కూడా పట్టుకోని ఘనత జగన్ ది.. ఆ హంతకులను రక్షిస్తుంది కూడా జగన్ ప్రభుత్వమే.. సొంత చెల్లి, తల్లిని దూరం చేసుకున్న జగన్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. వెరసి జగన్ మీద.. జగన్ పార్టీ మీద ఆంధ్రాలో పూర్తి వ్యతిరేకత నెలకొంది.

జనం వ్యతిరేకత MLAల మీద కాదు, జగన్ మీదనే ఉంది.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.