Annamalai Vs Thalapathy Vijay : తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలో చరిష్మా ఉన్న నేతలు కరువయ్యారు. కరుణా నిధి, ఎంజీఆర్, జయలలిత లాంటి ప్రజా బలం ఉన్న నేతలు లేకుండా పోయారు. కరుణానిధి కేవలం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ చరిష్మా అయితే ఎవరికీ లేదు.
ప్రస్తుతం డీఎంకే చాలా సీట్లు గెలిచినా కూడా అన్నాడీఎంకేపై వ్యతిరేకత వల్లనే వచ్చింది. తమిళనాడులో చాలా వర్గాలు, కులాలు, తీవ్రవాదులు సహా ఎంతో మంది కలగాపులగంగా మారి డీఎంకే గెలిచింది. డీఎంకే పాలనలో ఆ పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది. అవినీతిలో కూరుకుపోయింది.
అన్నాడీఎంకేలో ఫళని స్వామి, పన్నీర్ సెల్వం, శశికళలతో నాలుగు వర్గాలుగా విడిపోయింది.
ఇప్పుడు లీడర్ గా బీజేపీ తరుఫున ఫోకస్ అయ్యారు అన్నామలై. అయితే అప్పుడు అన్నామలై లీడర్ కాదంటూ అన్నాడీఎంకే ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు..
2024 ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులపై రామ్ గారి సునిశిత విశ్లేషణను ‘కింది’ వీడియోలో చూడొచ్చు..