Pawan Kalyan Varahi Yatra : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి నుంచి మొదలుకాబోతోంది. నాయకుడికి ఒక విజన్ ఉండాలి. సంకల్ప బలం ఉండాలి. ఆ రెండూ సంవృద్ధిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. దానికి అందివచ్చిన వరం పవన్ సెలబ్రెటీ కావడం.. రేపటి నుంచి వారాహి యాత్ర ఆంధ్ర రాజీయాలను మలుపుతిప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు యాత్రకు అనుమతి ఇచ్చారు. వారాహి యాత్రకు ఉన్న ఆటంకాలు తొలగిపోవడంతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం వరకు కూడా యాత్రకు అనుమతి రాలేదు. దీంతో ఒకింత టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అడిగిన సమాచారం అందించారు. దీంతో మధ్యాహ్నం యాత్రకు లైన్ క్లియర్ అయింది.
ఇక రాత్రికి అన్నవరం చేరుకోనున్న పవన్ బుధవారం ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారు. తర్వాత యాత్ర ప్రారంభిస్తారు. కత్తిపూడిలో నిర్వహించే మొదటి బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముందే చాలా శుభశకునాలు వచ్చాయి.. అవేంటి? వాటి వల్ల లాభమేంటి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
