Manipur Issues : మణిపూర్ లో అసలు ఏం జరుగుతోంది? అక్కడ ఘర్షణలకు కారణమేంటి? ఎందుకు దాడులు జరుగుతున్నాయన్న దానిపై దేశ ప్రజలకు అసలు నిజాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మణిపూర్ లో ఘాతుకాలపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు పోస్టులు చూస్తుంటే ప్రజలకు నిజం తెలియదా? అన్న సందేహం వస్తోంది.
మణిపూర్ లో జరిగే ఘర్షణలు క్రిస్టియన్లపై దాడి లాగా అందరూ అభివర్ణిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ కూడా క్రిస్టియన్లపై దాడిలాగా ఆరోపించింది. మైనార్టీలపై దాడిలాగా ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మణిపూర్ హింసలో మతం అనేది అసలు ప్రధానమైనది కాదు.. అసలు అక్కడ అది గొడవలకు కారణం అవుతున్నది కాదు. ఇది చాలా మందికి తెలియని విషయం.
మణిపూరీల మధ్య జరిగిన గొడవలు ఇవాల్టివి కావు. మణిపూర్ లో ఘర్షణలు మైతీల మధ్యే జరిగాయి. అయితే మైతీల్లో అన్ని మతాల వారు ఉన్నారు. మైతీల్లో 10శాతం ముస్లింలు.. సనామీహిమ్ ఆదివాసీ హిందువులు 10శాతం.. క్రిస్టియన్లు కూడా ఉన్నారు. మైతీలు అన్ని మతాల వాళ్లు ఉన్నారు.
మైతీలు కేవలం హిందువులే కాదు, అన్ని మతాలవారు, కమ్యూనిస్టులు కూడా మైతీలే.. మణిపూర్ లో హింసకు గల కారణాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.