https://oktelugu.com/

Mysterious Door: ఆకాశంలో ఈ వింతను చూశారా..? ఏమై ఉంటుంది అంటూ నెటిజన్ ప్రశ్న..?

కర్ణాటకలో మారిన వాతావరణం నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • BS
  • , Updated On : July 25, 2023 5:11 pm
    Mysterious Door

    Mysterious Door

    Follow us on

    Mysterious Door: విశాల ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. నింగి వైపు చూస్తూ మనకు తోచిన విధంగా ఆకారాలకు పేర్లు పెట్టుకుంటాము. కొన్నిసార్లు కనిపించే వింత ఆకారాలు, దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయ. ఆకాశానికి చీర కట్టినట్లు కనిపించే ఇంద్ర ధనుస్సు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ చిన్న పెద్దలను కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక వర్షా కాలం సమయంలో అయితే ఆకాశంలో కనిపించే అద్భుతాలకు కొదవే ఉండదు. ఉరుములు, మెరుపులు ఏర్పడినప్పుడు.. మేఘాలు నల్లగా మబ్బుల్లాగా మారినప్పుడు కొన్ని వింత ఆకారాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొన్నిసార్లు సాసర్లు కనిపించడం, ఆకాశం రంగులు మారడం, ఏనుగు ఆకారాలు, కొన్ని సార్లు ఏర్పడే వింత ఆకారాలు చూసి ఇదేదో ఏలియన్స్ పని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అటువంటి ఘటనే కర్ణాటకలో ఒకటి ఆవిష్కృతమైంది.

    కర్ణాటకలో మారిన వాతావరణం నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఒక ఆకారం ఆకాశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్ సమీపంలో ఆకాశంలో ఈ వింత ఆకారం కనిపించింది. మిరుమిట్లు గొలిపేలా, తలుపుల ఆకారంలో ఉన్న ఓ ఇమేజ్ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఒక యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ హెబ్బాల్ ఫ్లై ఓవర్ సమీపంలో ఆకాశంలో ఒక మిస్టీరియస్ నీడ కనిపించింది. దీనిని ఇంకెవరైనా చూశారా..? ఇది బహుశా ఏమై ఉండొచ్చు. భవనం నీడనా..? అలా అయితే దాని వెనుక ఉన్న సైన్స్ ఏమై ఉండవచ్చు’ అని ఆ వీడియో పోస్ట్ చేసిన నెటిజన్ ప్రశ్నలు కూడా సంధించాడు. 15 సెకండ్ల పాటు ఉన్న ఆ వీడియోను వేలాదిమంది వీక్షించడంతోపాటు వందలాదిగా కామెంట్లు వస్తున్నాయి. ఇది స్వర్గానికి తలుపులని, అది స్వర్గానికి మార్గం అని కొంతమంది రాసుకొచ్చారు. కొంత మంది ఏలియన్స్ పని అని, ఆరబెట్టుకోవడానికి వచ్చాయంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు వల్ల ఆకాశంలో ఇటువంటి దృశ్యాలు ఆవిష్కృతం కావడం సర్వసాధారణమే అంటూ పలువురు పేర్కొంటున్నారు.