గత కొన్ని రోజులుగా పసిడి ధరలు అంతకంతకూ తగ్గుతుండగా ఆ తగ్గుదలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. అయితే బంగారం ధర పెరిగినప్పటికీ వెండి ధరలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధర అంతకంతకూ పెరుగుతోంటే వెండి ధర మాత్రం తగ్గుతుండటం గమనార్హం. భారత్ లో బంగారం స్వలంగా మాత్రమే పెరగడంతో కొనుగోలుదారులకు నష్టం లేదు.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు..?
హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 49,760 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం కూడా 10 రూపాయలు పెరిగి 45,610 రూపాయలకు చేరింది. బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడటంతో బంగారం ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం ధర పెరిగినా వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గి 64,800 రూపాయలుగా ఉంది.
Also Read: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ..?
మరోవైపు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారానికి వ్యాపారుల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. అయితే వ్యాపారులు, పరిశ్రమ యూనిట్లు వెండి కొనుగోలుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే బంగారం ధర ఔన్స్ కు 0.18 శాతం పెరిగి 1808 డాలర్లుగా ఉంది. వెండి ధర మాత్రం 0.46 శాతం తగ్గి 23.25 డాలర్లకు చేరింది.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం: జనరల్
బంగారం, వెండి ధరలలో మార్పులకు అనేక కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, బంగారం కొనుగోళ్లు, కేంద్రం దగ్గర ఉండే బంగారం నిక్షేపాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇతర అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంటాయి.