వాగులో కొట్టుకుపోయిన కారు: ఒకరి గల్లంతు

ఆంధ్రప్రదేశ్ పై నివర్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు పొంగుతున్నాయి. ప్రకాశం జిల్లాల్లోని నాగులుప్పలపాడు మండలం కొత్తకొట వద్ద వాగు ఉధ్రుతంగా ప్రవహించడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో రాజేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన యువకుడి కోసం పోలీసులు గజ […]

Written By: Suresh, Updated On : November 27, 2020 11:16 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ పై నివర్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు పొంగుతున్నాయి. ప్రకాశం జిల్లాల్లోని నాగులుప్పలపాడు మండలం కొత్తకొట వద్ద వాగు ఉధ్రుతంగా ప్రవహించడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో రాజేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన యువకుడి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపులు చేపట్టారు. మరోవైపు వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో విజయవాడ- చెన్నై రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.