https://oktelugu.com/

డబ్బుల కోసం ఆ పని చేయలేనంటున్న యాంకర్ విష్ణుప్రియ..!  

కరోనా సమయంలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొలినాళ్లలో చప్పగా సాగిన ఈ షో క్రమంగా పుంజుకుంది. బిగ్ బాస్ అదిరిపోయే టాస్కులు పెడుతుండటంతో షోను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.  ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. Also Read: బిగ్ బాస్ ట్వీస్ట్.. ఈవారంలో రీఎంట్రీ… ఎలిమినేషన్ లేవా? బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అభిజిత్.. అఖిల్.. సొహైల్.. దెత్తడి హరిక.. మొనాల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 10:37 AM IST
    Follow us on

    కరోనా సమయంలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొలినాళ్లలో చప్పగా సాగిన ఈ షో క్రమంగా పుంజుకుంది. బిగ్ బాస్ అదిరిపోయే టాస్కులు పెడుతుండటంతో షోను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.  ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది.

    Also Read: బిగ్ బాస్ ట్వీస్ట్.. ఈవారంలో రీఎంట్రీ… ఎలిమినేషన్ లేవా?

    బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అభిజిత్.. అఖిల్.. సొహైల్.. దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అవినాష్ మాత్రమే ఉన్నారు. వీరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఈ ఏడుగురిలో విజేత ఎవరా? అనే ఆసక్తి నెలకొంది. ఇక బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో సెలబ్రెటీలంతా ఒక్కొక్కరుగా బిగ్ బాస్ పై స్పందిస్తున్నారు. ఈక్రమంలోనే యాంకర్ విష్ణుప్రియ ‘బిగ్ బాస్’ షోపై షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

    బుల్లితెరపై గ్లామర్ షోతో ఆకట్టుకునే యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని షోలకు అసిస్టెంట్ గా చేసిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. జబదస్త్ కామెడీయన్ సుడిగాలి సుధీర్ తో ఆమె చేసిన ‘పోవే.. పోరా’ షో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సుధీర్-విష్ణుప్రియ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న వార్తలతో ఆమె పాపులర్ గా మారింది.

    Also Read: సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక ట్విస్ట్

    బుల్లితెరపై గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడకపోవడంతో విష్ణుప్రియకు కుర్రకారులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ తాజాగా ‘చెక్ మేట్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇటీవల రిలీజైన ఈ ట్రైలర్లో ఈ అమ్మడు క్లివేజ్ షోతోపాటు లిప్ లాక్ సీన్స్.. బికినీలో కన్పించి అదరగొట్టింది. ఇక బిగ్ బాస్-4 సీజన్లలో ఆమె కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

    బిగ్ బాస్ అంటే తనకు ఇష్టం ఉండదని.. అలాంటి షోలకు లక్షలు.. కాదు కోట్లు ఇచ్చిన వెళ్లనని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా బయట ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు బందీగా ఉండాలంటూ ప్రశ్నించింది. ఈ షోలో నిత్యం కొట్టుకొవడాలు.. గొడవలు ఉంటాయని.. అలాగే ప్రతీవారం ఒకరిని ఎలిమినేషన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    లైఫ్ లో మనం ఎవరికీ కూడా ఎలిమినేట్ చేయద్దని.. వీలైతే ప్రేమించాలంటూ హితబోధ చేసింది. డబ్బుల కోసం నేను అలాంటి పనులు చేయనని.. ఇకపై కూడా నేను బిగ్ బాస్ షోకు వెళ్లను.. ఇది రాసిపెట్టుకొండి అంటూ విష్ణుప్రియ స్పష్టం చేయడం గమనార్హం.