దేశంలో చాలామంది తక్కువ సమయంలో తక్కువ వడ్డీకి రుణం పొందడానికి గోల్డ్ లోన్ ను తీసుకుంటూ ఉంటారు. బంగారంపై రుణాలు ఇవ్వడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి బ్యాంకులు సైతం గోల్డ్ లోన్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటాయి. బ్యాంకులు నిర్ణయించిన కాలవ్యవధి ముగిసే సమయంలోపు రుణాన్ని తీసుకున్న వాళ్లు రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడం ద్వారా బంగారం వెనక్కు తీసుకోవచ్చు.
Also Read: కొత్త కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణాలు..?
18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్లు గోల్డ్ లోన్ పొందడానికి అర్హులు. గోల్డ్ లోన్ ను తిరిగి చెల్లించడానికి స్వల్ప కాలిక వ్యవధి, మధ్యకాలిక కాల వ్యవధి ఉంటాయి. వడ్డీరేటు, నిబంధనలను బట్టి లోన్ తీసుకున్న రోజు నుంచి 5 సంవత్సరాల లోపు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే బంగారం రుణాన్ని తీసుకునే ముందు రుణం తీసుకునే వాళ్లు కొన్ని నియమనిబంధనల గురించి కచ్చితంగా అవగాహనను కలిగి ఉండాలి.
Also Read: గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. ఆ ఛార్జీలు లేనట్లే..?
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు బంగారం విలువలో కేవలం 75 శాతం మాత్రమే రుణంగా పొందవచ్చు. బంగారం రుణాలు తీసుకుంటే తక్కువ రుణానికి తక్కువ వడ్డీరేటు ఎక్కువ రుణానికి ఎక్కువ వడ్డీరేటు ఉంటుంది. వడ్డీని ఒకేసారి చెల్లించలేని వాళ్లు నెలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది. అలా వడ్డీ చెల్లించడం వల్ల అసలు మొత్తాన్ని సులభంగా చివరకు చెల్లించవచ్చు.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
బంగారం రుణం తీసుకునే ముందు బ్యాంకులు, ఇతర సంస్థలు వడ్డీరేట్లను పరిశీలించుకుని రుణం తీసుకోవాలి. రుణాలను తిరిగి చెల్లించే నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకుంటే మంచిది. ఇతర రుణాలతో పోలిస్తే బంగారం రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉంటుంది.