https://oktelugu.com/

నడ్డాతో సోము, బండి.. ఏపీలోకి బండి సంజయ్ ఎంట్రీ.?

తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఇన్ చార్జీలతో ఢిల్లీ వేదికగా సమాలోచనలు జరుపుతోంది. ఎలాగైనా సరే తెలంగాణలో లాగా ఏపీలోనూ బలపడేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ ఆశించిన బలం పుంజుకోవడం లేదు. ఈ లోపాన్ని అధిగమించేందుకు హైకమాండ్ ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చిన జోష్ ను ఏపీలోనూ నింపాలని భావిస్తున్నట్టు సమాచారం. Also Read: కాంగ్రెస్ కు పులులు.. సింహాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 05:43 PM IST
    Follow us on

    తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఇన్ చార్జీలతో ఢిల్లీ వేదికగా సమాలోచనలు జరుపుతోంది. ఎలాగైనా సరే తెలంగాణలో లాగా ఏపీలోనూ బలపడేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ ఆశించిన బలం పుంజుకోవడం లేదు. ఈ లోపాన్ని అధిగమించేందుకు హైకమాండ్ ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చిన జోష్ ను ఏపీలోనూ నింపాలని భావిస్తున్నట్టు సమాచారం.

    Also Read: కాంగ్రెస్ కు పులులు.. సింహాలు అక్కర్లేదంటున్న జగ్గారెడ్డి..!

    తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులు భేటి అయ్యారు. కీలక మంతనాలు జరిపారు. కొన్ని ఉమ్మడి అంశాలు చర్చించినట్టు సమాచారం.

    దుబ్బాక, జీహెచ్ఎంసీలో విజయాలను అందించి తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయ శక్తిగా బీజేపీని నిలపడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. దీన్ని కొనసాగించి పార్టీని విస్తరించాలని అధిష్టానం కోరినట్టు సమాచారం.

    ఇక ఏపీలో బీజేపీ విస్తరణపై చర్చించినట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికతో బీజేపీ బలం బలగం ఏపీలో తేలనుంది. తిరుపతిలో బలమే ఏపీలో బీజేపీ భవిష్యత్తును నిర్ధేశిస్తుందని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికపై ఫుల్ ఫోకస్ పెట్టాలని జేపీ నడ్డా తాజాగా సోము వీర్రాజుకు సూచించినట్టు తెలిసింది.

    Also Read: రణరంగమైన రామతీర్థం

    తెలంగాణ లో బీజేపీ సక్సెస్ తో ఏపీలోని నేతలపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొత్త తరహా వ్యూమాలతో ముందుకు వెళ్లాలని కమలనాథులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

    ఏపీలో జరుగుతున్న సమస్యలపై సైతం ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తిరుపతి అపచారంపై బండి సంజయ్.. శ్రీశైలంలో దారుణాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ నేతలతోపాటు తెలంగాణ బీజేపీ నేతలను కూడా పుణ్యక్షేత్రాలున్న తిరుపతిలో ప్రచారానికి వాడుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్ పక్కా హిందుత్వ వాదిగా అదే ఏజెండాతో వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోకి బండి సంజయ్ రాకకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందన్న ప్రచారం సాగుతోంది. తద్వారా ఏపీలోనూ బలంగా నిలబడాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. సోము వీర్రాజుకు తోడుగా బండి సంజయ్ వస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ కనిపిస్తుందని అధిష్టానం నమ్ముతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్