2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పావులు కదుపుతోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 2020లో వరుస షాకులిచ్చిన బీజేపీ 2021లోనూ అదే పంథాను కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.
Also Read: నడ్డాతో సోము, బండి.. ఏపీలోకి బండి సంజయ్ ఎంట్రీ.?
దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దీంతో ఇతర పార్టీల నేతలంతా బీజేపీలో చేరుతున్నారు.
అధిష్టానం సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీలోకి వలసలు షూరు అయ్యాయి. సీఎం కేసీఆర్ కూతురు కల్వకంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి కూడా బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకునేందుకు ఢిల్లీకి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: కాంగ్రెస్ కు పులులు.. సింహాలు అక్కర్లేదంటున్న జగ్గారెడ్డి..!
డిచ్‌పల్లి మండలానికి చెందిన ఎంపీపీ గద్దె భూమన్న.. నలుగురు ఎంపీటీసీలు.. 9మంది సర్పంచులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు మాజీ జడ్పీటీసీ కులచారి దినేశ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు రూరల్ మండలాల్లోని సర్పంచ్‌లు సైతం ఆదివారం రాజీనామా చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయానే ఆవేదనతో వీరంతా రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్