https://oktelugu.com/

Tamil Nadu Politics : తమిళనాట గట్టి ముక్కోణపు పోటీ జరగబోతుందా?

తమిళనాట గట్టి ముక్కోణపు పోటీ జరగబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • Neelambaram
  • , Updated On : March 2, 2024 / 01:01 PM IST

    Tamil Nadu Politics : తమిళనాడులో గత రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన పూకార్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్నాడీఎంకేతో చర్చలు మొదలుపెట్టిందన్నది సారాంశం.. బ్యాక్ చానెల్ టాక్స్ ఓపెన్ చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ను లాగాలని ప్రయత్నం చేస్తోంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ అలా చేస్తున్నట్టు దాఖలాలు లేవు.

    డీఎంకే ఆల్ రెడీ కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకుంది. ముస్లింలీగ్, కొంగునోడు, దేశీ మక్కల్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంది. సీపీఐ, సీపీఎం రెండు సీట్లు చొప్పున ఇచ్చారు. కాంగ్రెస్, డీఎంకేడీకే సహా ఇంకొన్ని పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నారు.

    కాంగ్రెస్ దాదాపు 15 సీట్లకు బేరం పెట్టారు. అందుకే ఎక్కువ ఇవ్వడానికి డీఎంకే ఒఫ్పుకోవడం లేదు. దీంతో అన్నాడీఎంకేతో పొత్తు కోసం కాంగ్రెస్ ద్వారాలు తెరిచింది.

    తమిళనాట గట్టి ముక్కోణపు పోటీ జరగబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.