Pawan Kalyan : పవన్ కళ్యాన్ పదేపదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో జనం నన్ను రెండు చోట్ల ఓడించాడు. జనసేనను పనిగట్టుకొని ఓడించారు. అందుకే ఈరోజు తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని ప్రతీచోట చెబుతూ వస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ చేసిన మూడు అతిపెద్ద తప్పిదాలు ఏంటి? అన్నది తెలుసుకుందాం.. 2019 నాటి పరిస్థితులు ఏంటో చూద్దాం.. 2014 తర్వాత పవన్ కళ్యాణ్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక్కసారిగా జనం ముందుకు వచ్చారు. పార్టీ నిర్మాణం లేదు.. నేతల బలం లేదు.
అయినా జనంను అట్రాక్ట్ చేయగలిగాడు. కానీ ఫలితం దారుణంగా రావడానికి జనంలో లేకపోవడమే కారణం. మొత్తం జనం పర్ సెప్షన్ ను ఒక్కసారిగా మార్చిన అంశం ఏంటంటే.. ఎన్నికలకు 10 రోజుల ముందు అధికార పార్టీని విమర్శించకుండా నాటి ప్రతిపక్ష జగన్ ను విమర్శించడం మొదలుపెట్టాడు. తెలుగుదేశాన్ని ఒక్క మాట అనకుండా ప్రతిపక్షంలోని జగన్ ను విమర్శించడం స్ట్రాట్ చేశాడు. దాంతో జగన్ కు ఒక్క అవకాశం దొరికింది.
టీడీపీకి బీ టీం జనసేన అని.. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయాడని జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. ఎన్నికలకు వారం ముందు వరకూ చంద్రబాబు, లోకేష్ ను ఏకిపారేసి.. ఆ తర్వాత జగన్ పై వారం ముందు తిట్టడం మొదలుపెట్టడం పెద్ద మైనస్ అయ్యింది. ఇదే పవన్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ యూటర్న్ తీసుకోకపోయి ఉంటే ఫలితం ఇంత దారుణంగా ఉండేది లేదు.
2019లో జనసేన ఓటమికి అతిపెద్ద కారణమేంటి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు