Munugodu Bypoll Winner: తెలంగాణలో ఉత్కంఠ రేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రచార పర్వంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులంతా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. టీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరుఫున పాల్వాయి స్రవంతి అభ్యర్థులుగా ఉన్నారు.

ఉదయం 9 గంటల వరకూ మునుగోడు నియోజకవర్గంలో 11.20 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాల్వాయి స్రవంతి ఇడికూడలో.. టీఆర్ఎస్ అభ్యర్తి ప్రభాకర్ రెడ్డి లింగవారిగూడెంలో ఓటు వేశారు. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ఓటు ఉండడంతో ఆయనకు ఇక్కడ ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది.
ప్రస్తుతం ఓటింగ్ సరళిని బట్టి చూస్తుంటే మునుగోడులో బీజేపీ వెనుకబడిపోయినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి ఆ ఊపు రావడం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి ఉందని ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది.
రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేకతతో 25 శాతం వరకూ మాత్రమే ఓట్లు పడుతున్నాయని.. అదే టీఆర్ఎస్ కు 38 శాతం, కాంగ్రెస్ 34 శాతం వరకూ ఓట్లు పడుతున్నాయని ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది.
ఓవరాల్ గా చూస్తే మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉండొచ్చని.. టీఆర్ఎస్ కే కాస్త ఎడ్జ్ ఉండొచ్చు అని తెలుస్తోంది.