AAP National party status : దేశ రాజధాని ఢిల్లీలో ఆవిర్భవించిన పార్టీ ఆమ్ ఆద్మీ. నిజాయతీ పాలన, ప్రజసేవ లక్ష్యంగా పార్టీకి పునాది వేశారు అరవింద్ కేజ్రీవాల్. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్. అయితే నాడు సంకీర్ణ ప్రభుత్వం కొద్ది రోజలకే కూలిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఓటర్లు సంపూర్ణ మెజారిటీతో పట్టం కట్టారు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరంగా ఉంటూ, కేంద్రంతో కొట్లాడుతూ ఢిల్లీ వాసులకు సుపరిపాలన అందిస్తున్నారు కేజ్రీవాల్.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ… తర్వాత జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ పాగా వేసింది. అక్కడి కాంగ్రెస్‌లో నెలకొన్న అస్థిరత, పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోరాడారు. ఢిల్లీ పాలనను, ప్రభుత్వ పథకాలను పంజాబ్ ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆప్‌వైపు తిప్పుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే జాతీయ పార్టీలతోపాటు స్థానిక అకాళీదల్ పార్టీకి భిన్నంగా వ్యూహాలు రచించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థి ఎవరు కావాలో మీచే చెప్పండి అంటూ ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ ఇచ్చారు. మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థినే సీఎంను చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడి ఓటర్లు ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించడంతో వారు సూచించిన భగవంత్ మాన్‌నే సీఎం చేశారు అరవింద్.
తర్వాత గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ సీట్లు గెలవకున్నా జాతీయ పార్టీ కోసం కావాల్సిన ఓట్ల శాతాన్ని సాధించింది. గుజరాత్ ఎన్నికల్లో 13శాతం ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తమను జాతీయ పార్టీగా గుర్తించాలని ఆమ్ ఆద్మీ కర్ణాటక హైకోర్టుకు ఎక్కడంతో ఈసీని వివరణ కోరింది. ఈసీ కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాపై నిర్ణయం చెబుతామన్నారు. దీంతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా రావడం లాంఛనమే.
మరి ఆప్ జాతీయపార్టీ గుర్తింపు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
