https://oktelugu.com/

పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ లో కీలక మార్పులు చేసి పెన్షన్ తీసుకునే వారికి ప్రయోజనం చేకూరేలా చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫ్యామిలీ పెన్షన్ ను భారీగా పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఉద్యోగాల కుటుంబానికి ఊరట కలిగే విధంగా వెలువడిన ఈ ప్రకటన వల్ల పెన్షన్ తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. Also Read: ఆ ఆస్పత్రిలో ఫీజు రూపాయి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 14, 2021 / 05:02 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ లో కీలక మార్పులు చేసి పెన్షన్ తీసుకునే వారికి ప్రయోజనం చేకూరేలా చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫ్యామిలీ పెన్షన్ ను భారీగా పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఉద్యోగాల కుటుంబానికి ఊరట కలిగే విధంగా వెలువడిన ఈ ప్రకటన వల్ల పెన్షన్ తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

    Also Read: ఆ ఆస్పత్రిలో ఫీజు రూపాయి మాత్రమే.. ఎక్కడంటే..?

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా చేసిన ఈ ప్రకటన వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువ పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ లిమిట్ నెలకు 45 వేల రూపాయల కంటే తక్కువగా ఉంటే ఒకే కుటుంబంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండి మరణించినా వారి ఇద్దరి పెన్షన్ కుటుంబ సభ్యులకు వచ్చే విధంగా నిబంధనలు ఉండేవి. కేంద్రం ఈ నిబంధనలలో కీలక మార్పులు చేసింది.

    Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ ఏడాది రాబోయే కొత్త ఫీచర్లివే..?

    పెన్షన్ లిమిట్ నెలకు గరిష్టంగా 1,25,000 రూపాయల వరకు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం మోదీ సర్కార్ పెన్షన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 6వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ అందుతుండగా ఇకపై 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనం అందుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు చనిపోతే వారి భాగస్వామి పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. భాగస్వామి కూడా చనిపోతే పిల్లలు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గరిష్ట వేతనంగా రూ.2.5 లక్షలను పరిగణనలోకి తీసుకోవడంతో అందులో సగం 1,25,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది.