https://oktelugu.com/

దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటుందట !

కంగనా రనౌత్ ఏం చేసినా ప్రత్యేకమే. ప్రసుతం హీరోయిన్లంతా ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఎక్స్ స్రైజ్ లు చేస్తూ ఉంటే.. కంగనా మాత్రం హీరోయిన్లే ఎందుకు ఫిట్ గా ఉండాలి ? అని ఎదురు ప్రశ్నిస్తుంది. పైగా తానూ ఇప్పటి నుండి మరో నాలుగు నెలల్లో లావు అవుతా అని కూడా అంటుందట. ఇంతకీ కంగనా లావు అవుతుంది తలైవి సినిమా కోసం అని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. సినిమా కోసం బరువు పెరుగుతూ, దాన్ని కూడా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 14, 2021 / 05:26 PM IST
    Follow us on


    కంగనా రనౌత్ ఏం చేసినా ప్రత్యేకమే. ప్రసుతం హీరోయిన్లంతా ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఎక్స్ స్రైజ్ లు చేస్తూ ఉంటే.. కంగనా మాత్రం హీరోయిన్లే ఎందుకు ఫిట్ గా ఉండాలి ? అని ఎదురు ప్రశ్నిస్తుంది. పైగా తానూ ఇప్పటి నుండి మరో నాలుగు నెలల్లో లావు అవుతా అని కూడా అంటుందట. ఇంతకీ కంగనా లావు అవుతుంది తలైవి సినిమా కోసం అని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. సినిమా కోసం బరువు పెరుగుతూ, దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకుంటుంది కంగనా అంటూ బాలీవుడ్ లో ఎప్పటిలాగే ఆమె పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు అనుకోండి.

    Also Read: తనకు తానే డబ్బా కొట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ !

    అయినా ఎవరు ఏమనుకున్నా తనకేమి అన్నట్లు ఉంటుంది కంగనా వ్యవహారం. అసలుకే ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు ఎవరి పై ఫైర్ అవుదామా అన్నట్టు ఉంటుంది. పైగా మాములు సినిమాల్లోనే ఎప్పుడూ హాట్ గా కనిపిద్దమా అని ఎదురుచూస్తూ ఉంటుంది, ఆ అలవాటులోనే తలైవి సినిమాలో కూడా ఓ సీన్ లో కాస్త హద్దు మీరి నటించిందట. ఇప్పుడు ఆ సీన్ ను అమ్మ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక వచ్చే ఏడాది కంగనా ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతుంది. ఇప్పటికే ఈ బ్యూటీ కథ కూడా రాసిందట. తానూ కథ రాయడానికి కారణం, కేవలం దర్శకత్వం చేయడానికేనట.

    Also Read: రకుల్ తరువాత ప్రణీతను పట్టుకున్నాడు !

    కాగా ఈ రైటింగ్ అనేది గొప్ప కళ అని కూడా చెబుతుంది. హీరోయిన్ గా తనకు పెద్ద స్టార్ డమ్ ఉన్నా, వరుస చాన్స్ లు వస్తున్నా.. కంగనా మాత్రం సంతృప్తి పడట్లేదు. ఖాళీ దొరికితే చాలు, కాలక్షేపం చేయకుండా దర్శకత్వం పై అవగాహన పెచుకుంటుందట. కంగనా ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తోంది. జయలలిత అంటే.. అక్కడి ప్రజలకు దేవతతో సమానం. అలాంటి దేవత పాత్రలో కంగనా ఎలా నటిస్తోందో చూడాలి. ఇక అమ్మ జయలలిత జీవితం ఆధారంగా రానున్న ఈ బయోపిక్ ను ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్