https://oktelugu.com/

ప్లాప్ అయితే ఇక దుకాణం సర్ధేసుకోవడమే !

సినిమా ఇండస్ట్రీలో తమ వారసులను నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను ఒడ్డి, సర్వస్వం పోగొట్టుకున్నవాళ్ళు ఫిల్మ్ గల్లీల్లో చాలామంది తారసపడుతుంటారు. ఎందరో దర్శకనిర్మాతలు ఈ విషయంలో దెబ్బ తిన్నారు. ఆ రోజుల్లో నుండి ఇప్పటివరకూ హీరో అనే స్టార్ డమ్ ఆ ఫ్యామిలీ మొత్తానికి మంచి కిక్ ను ఇస్తోంది. అందుకే, కమెడియన్స్ దగ్గర నుండి లైట్ మ్యాన్ వరకూ కుదిరితే తమ పిల్లలను హీరోలనే చేయాలని ఉబలాట పడుతుంటారు. సన్ స్ట్రోక్ ఉంటుంది అని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 14, 2021 / 04:58 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో తమ వారసులను నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను ఒడ్డి, సర్వస్వం పోగొట్టుకున్నవాళ్ళు ఫిల్మ్ గల్లీల్లో చాలామంది తారసపడుతుంటారు. ఎందరో దర్శకనిర్మాతలు ఈ విషయంలో దెబ్బ తిన్నారు. ఆ రోజుల్లో నుండి ఇప్పటివరకూ హీరో అనే స్టార్ డమ్ ఆ ఫ్యామిలీ మొత్తానికి మంచి కిక్ ను ఇస్తోంది. అందుకే, కమెడియన్స్ దగ్గర నుండి లైట్ మ్యాన్ వరకూ కుదిరితే తమ పిల్లలను హీరోలనే చేయాలని ఉబలాట పడుతుంటారు. సన్ స్ట్రోక్ ఉంటుంది అని తెలిసినా ఎవ్వరు ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గరు. పూరి ఫ్యామిలీలో కూడా ఇలాంటి బాగోతమే ఉంది.

    Also Read: ఉప్పెన హీరోయిన్ వ‌య‌సు తెలుసా..? మ‌రీ ఇంత చిన్న పిల్లా..!

    మొదట పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో అనిపించుకోవడానికి పాపం పూరిని బాగానే నష్టపెట్టాడు. ఇంతలో కొడుకు ఎదిగివచ్చాడు. దాంతో తన కొడుకు ఆకాష్ పూరి కోసం పూరి జ‌గ‌న్నాథ్ తనకున్న కాస్త డబ్బును పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆకాష్ పూరి మొదటి సినిమా వల్లే పూరికి పదిహేను కోట్లు వరకూ లాస్ అట, అయినా పూరి మాత్రం కొడుకు మీద ప్రేమతో మరో పదికోట్లు ఖర్చు పెట్టి మరో సినిమా తీస్తున్నాడు. ఇది కూడా తేడాగానే ఉంది అనేది ఫిల్మ్ నగర్ టాక్.
    ఈ ‘రొమాంటిక్’ సినిమా కోసం పూరి జ‌గ‌న్నాథ్ ఎక్కువ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

    Also Read: సరదాల రోజు స్పెషల్ గా “బిగ్ బాస్ ఉత్సవం” !

    ప్రసుతం ఈ సినిమా రెడీ అయింది, రిలీజ్ చేద్దామంటే కొనేవాడు లేడు. కనీసం వచ్చిన బేరానికైనా అమ్ముదాం అంటే.. మరీ తక్కువుకి అడుగుతున్నారట. దాంతో పూరి ఈ సినిమాని ఓన్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. పాపం ఈ సినిమా గానీ ప్లాప్ అయితే, మరో పదిహేను కోట్లు పూరికి నష్టమే మిగులుతుంది. కొడుకు వల్ల ఇప్పటికే పదిహేను లాస్, ఇప్పుడు మరో పదిహేను అంటే.. అది పూరి కెరీర్ కే ప్రమాదం. మరి మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా.. రాకపోతే మాత్రం దుకాణం సర్ధేసుకోవడమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్