https://oktelugu.com/

ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గనున్న జీతాలు.. కానీ..?

2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. కొత్త వేతన చట్టం ప్రభావం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రధానంగా పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి వేతనం భారీగా తగ్గనుంది. కొత్త వేతన చట్టం వల్ల ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నేరుగా ప్రభావం పడనుంది. కొత్త వేతన చట్టం ప్రకారం బేసిక్ వేతనం 50 శాతంగా ఉండగా ఆలవెన్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 11, 2021 / 12:26 PM IST
    Follow us on

    2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. కొత్త వేతన చట్టం ప్రభావం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రధానంగా పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి వేతనం భారీగా తగ్గనుంది. కొత్త వేతన చట్టం వల్ల ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నేరుగా ప్రభావం పడనుంది. కొత్త వేతన చట్టం ప్రకారం బేసిక్ వేతనం 50 శాతంగా ఉండగా ఆలవెన్స్ లు 50 శాతం దాటకూడదు.

    Also Read: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష..?

    ఉద్యోగులకు బేసిక్ శాలరీ పెరగడం వల్ల ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ కూడా భారీగా పెరగనుంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల వేతనం 7 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయలకు పెరగనుండగా గ్యాట్యుటీ నిబంధనలలలో మార్పులు రానున్నాయి. గతంలో నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాలు పని చేస్తే మాత్రమే గ్రాట్యుటీ లభించేది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సంవత్సరం పని చేసినా గ్రాట్యుటీని పొందవచ్చు.

    Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. డబ్బులు లేకున్నా విత్ డ్రా..?

    కొత్త వేతన చట్టం గురించి ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ చట్టం వల్ల ప్రయోజనం చేకూరుతుందని భావిస్తుంటే మరి కొంతమంది ఈ నిబంధనల వల్ల వేతనం తగ్గితే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏ ఇన్‌స్టాల్‌మెంట్లను అందించటానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఉద్యోగులు, పెన్షనర్లకు జులై 1వ తేదీ నుంచి ఈ మొత్తం జమ కానుంది. పెండింగ్ లో ఉన్న డీఏ ఇన్‌స్టాల్‌మెంట్లు జమైతే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. కొత్త వేతన చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఉద్యోగులు ఈ చట్టం విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.