https://oktelugu.com/

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. చెల్లించక తప్పదు భారీ మూల్యం

మారుతున్న కాలంతో పాటు ప్రసారమాధ్యమాలు కూడా చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మొదట రేడియో.. పేపర్ కే పరిమితమైన వార్తలు.. ఇప్పుడు టీవీ చానళ్ల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని మన ముందుఉంచుతున్నాయి. జనరేషన్ అప్ డేట్ అవుతున్న కొద్ది.. చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. వాట్సాప్, యూట్యూబ్.. ఇతర మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ ప్రవాహం రోజురోజుకు పెరిగిపోతోంది. దాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2021 / 11:51 AM IST
    Follow us on


    మారుతున్న కాలంతో పాటు ప్రసారమాధ్యమాలు కూడా చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మొదట రేడియో.. పేపర్ కే పరిమితమైన వార్తలు.. ఇప్పుడు టీవీ చానళ్ల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని మన ముందుఉంచుతున్నాయి. జనరేషన్ అప్ డేట్ అవుతున్న కొద్ది.. చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. వాట్సాప్, యూట్యూబ్.. ఇతర మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ ప్రవాహం రోజురోజుకు పెరిగిపోతోంది. దాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. ఇక వారు భారత చట్టాల ప్రకారం.. శిక్షార్హులు ఫేక్ న్యూస్ ప్రచారం చేసినట్లు నిరూపణ అయితే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లోని సెక్షన్ 66డీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005లోని సెక్షన్ 54, ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని 153, 499,500,505(1) సెక్షన్ల ప్రచారం వారు శిక్షార్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    Also Read: పట్టుదల.. మొండి పట్టుదల ఎవరిది గెలుపు?

    ఓ వ్యక్తిపై వ్యంగ్యంగా వ్యాఖ్యాయనాలు చేయడం.. అతడి గురించి తప్పుడు కామెంట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం.. , నిందలు మోపడం వంటివి ఫేక్ న్యూస్ కిందకు వస్తాయి. దేశంలో ఏదైనా.. అనుకోని విపత్తు సంభవించినప్పుడు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారు.. లేదా ఆ విపత్తు తీవ్రత గురించి తప్పుడు హెచ్చరికలు చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవారు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 54 ప్రకారం శిక్షార్హులు.

    ఇలా ఫేక్ వార్తలు సృష్టిస్తే.. వార్తను బట్టి చర్యలు ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తిని వాడకూడని భాష ద్వారా లేదా.. సంకేతాల ద్వారా ఉద్దేశపూర్వకంగా దూషించడం, హాని తలపెట్టడం.. వాటిని పదేపదే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం.. వంటివి పరువు నష్టం కిందకే వస్తాయి. ఎందుకంటే.. ఈ చర్యల ద్వారా అతడు.. ఆమె సంఘంలో స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాసినట్లు అవుతుంది. అటువంటి చర్యలకు పాల్పడినవ వారికి ఐపీసీ సెక్షణ్ 499, 500 ప్రకారం శిక్ష విధించబడుతుంది.

    Also Read: వ్యతిరేక పవనాలు.. జమిలీ ఎన్నికలకు మోడీ బ్రేక్

    ఇదేకాక ఫేస్ బుక్.. ట్విట్టర్ సోషల్ మీడియాలో పెట్టే.. కామెంట్లపై పోలీసులు నిఘా పెంచుతున్నారు. దీనికోసం ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రధానంగా మహిళలు పెట్టిన ఫోటోలకు.. కామెంట్లు పెట్టినా ఇకపై చర్యలు తప్పవని తెలుస్తోంది. సోషల్ మీడియానే కదా.. మనం ఏం చెప్పినా.. చెల్లుతుందనుకుంటే.. పొరపాటే.. మీపై.. మీరు పెట్టే పోస్టులపై కూడా నిఘా ఉంటుందని గుర్తించాలి. మీ మెయిల్.. గుగుల్, అటాచ్ అయి ఉంటుంది కాబట్టి.. మీరు సెర్చ్ చేసే పదాలల్లో అసభ్యకరమైన పదజాలం, చైల్డ్ ఫోర్న్ కంటెంట్, టెర్రరిస్టు కంటెంట్, ఏది సెర్చ్ చేసిననా.. వేంటనే ఆ పదాల ఆధారంగా ఆటో మిషన్ ద్వారా మీ పూర్తి వివరాలు నిఘా వర్గాలకు చేరిపోతుంది. సో తస్మాత్ జాగ్రత్త…

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్