https://oktelugu.com/

కలల ప్రేమ మైకంలో ప్రభాస్-పూజా.. రాధేశ్యామ్ పోస్టర్ రిలీజ్..

శివరాత్రి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. ప్రభాస్ ను ప్రేమికుడిగా, లవర్ బ్యాయ్ గా మార్చి తీసిన చిత్రం ‘రాధేశ్యామ్’. జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతోంది. టీసిరీస్-యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 30న సినిమా రిలీజ్ కానుంది. పదేళ్ల తర్వాత ప్రభాస్ ప్రేమికుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో బోలెడు అంచనాలున్నాయి. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 11, 2021 / 12:27 PM IST
    Follow us on

    శివరాత్రి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. ప్రభాస్ ను ప్రేమికుడిగా, లవర్ బ్యాయ్ గా మార్చి తీసిన చిత్రం ‘రాధేశ్యామ్’. జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతోంది. టీసిరీస్-యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 30న సినిమా రిలీజ్ కానుంది.

    పదేళ్ల తర్వాత ప్రభాస్ ప్రేమికుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో బోలెడు అంచనాలున్నాయి. తాజాగా చిత్ర బృందం ఆ మూవీలోని ఒక అందమైన ప్రేమ కావ్యంలాంటి ఫొటోను ‘శివరాత్రి’ సందర్భంగా రిలజీ్ చేసింది.

    ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకోగా.. ఈసారి కలల ప్రేమలోకంలోకి తీసుకెళ్లారు. శివ-పార్వతి పురాణ ప్రేమకథకు గౌరవ చిహ్నంగా ఈ చిత్ర నిర్మాతలు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

    పోస్టర్ చూస్తే ప్రేమలోకంలో ప్రభాస్-పూజా హెగ్డే విహరిస్తున్నట్టే కనిపిస్తోంది. మంచు కురిసిన నేలపై ప్రభాస్-పూజా హెగ్డే జంట కలిసిపోయి పడుకొని తలలు కలిసిపోయి హృద్యంగా ప్రేమించుకుంటున్న దృశ్యం కిరాక్ పుట్టిస్తోంది. కలల్లో విరహ వేదన అనుభవిస్తున్న జంట తన్మయత్వం కనిపించింది.

    ఈ పోస్టర్ ఓ లెవల్లో డిజైన్ చేశారు. ఇటలీలోని రోమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అద్భుతమైన లోకేషన్లలో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.