https://oktelugu.com/

Tamannaah : తమన్నా ను విచారించిన ఈడీ…అసలేం జరిగిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక హీరోల విషయానికి వస్తే వాళ్ల కెరియర్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుందో ఎప్పుడు డౌన్ అయిపోతుందో ఎవరు చెప్పలేరు... చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు దక్కకపోవడంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 07:29 AM IST

    ED interrogated Tamannaah...what actually happened..

    Follow us on

    Tamannaah : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటి తమన్నా… హ్యాపీ డేస్ సినిమాతో ప్రేక్షకులందరిలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు తనను తాను మరొకసారి స్టార్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉంది. ఇక ఒకప్పుడు తమన్నా స్టార్ హీరోలందరి తో సినిమాలు చేసింది.  కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఆమెతో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినప్పటికి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఆమె చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. ఇక ఇప్పుడు  సంపత్ నంది డైరెక్షన్ లో ఓదెల 2 సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తను చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న తమన్నా తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తమన్నా ఇటు తెలుగు,అటు బాలీవుడ్, తమిళ్ 3 లాంగ్వేజ్ లో కూడా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుంది.
    ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా తమన్నాకి ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) వాళ్ళు తమన్నాను విచారించినట్టుగా తెలుస్తుంది. ‘హెచ్ పి జెడ్ టోకెన్’ యాప్ నకు సంభందించిన బిట్ కాయిన్స్ సహా పలు క్రిష్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను ఈ యాప్ మోసం చేసినట్లు కేసులున్నాయి…ఇక ఈ యాప్ నకు సంభందించిన ఒక ఈవెంట్ లో తమన్నా పాల్గొన్నట్లుగా వాళ్ల దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా ఈడీ వాళ్ళకి సమాచారం అందడం తో వాళ్ళు తమన్నా ను విచారించారు…
    ఇక ఫైనల్ గా ఆమె పై ఎలాంటి అభియోగాలు లేవని పేర్కొనడం విశేషం… ఏది ఏమైనా కూడా తమన్నా లాంటి నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాలుగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీకి సేవలు చేస్తూ ముందుకు సాగుతుంది. యంగ్ హీరోలు,  సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి హీరోతో ఆడి పాడడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి పెద్దగా సక్సెస్ అయితే కలిసి రావడం లేదు.
    చిరంజీవితో చేసిన భోళా శంకర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇంకా రజనీకాంత్ జైలర్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మెప్పించినప్పటికి ఈ సినిమా సూపర్ సెక్షన్ అయితే సాధించింది. కానీ ఈ సినిమాలో తను హీరోయిన్ గా చేయకపోవడం వల్ల ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం రజినీకాంత్ కి వెళ్ళింది…