Game Changer Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమాకి మధ్యలో కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఫలితంగా గత ఏడాది విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు విడుదల అవ్వగా, వాటికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ దీపావళి కి టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. టీజర్ కి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారు.
ఎప్పటికప్పుడు ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలలో మొదలైంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, కేవలం తెలుగు రాష్ట్రాలకు ఈ సినిమా బిజినెస్ 150 కోట్ల రూపాయలకు జరిగిందట. రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి తెలుగు రాష్ట్రాలకు 120 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో 5 మిలియన్ డాలర్స్ కి బిజినెస్ జరిగినట్టు సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ చిత్రం నార్త్ అమెరికా లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్, 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. అలాగే తమిళం లో శంకర్ కి మంచి క్రేజ్ ఉన్నందున, ఈ సినిమా తమిళనాడు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఈ చిత్రానికే తమిళ నాట ఎక్కువ జరిగింది. అలాగే హిందీ వెర్షన్ 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ వరల్డ్ కూడా కలుపుకొని చూస్తే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 250 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని సమాచారం. అంటే కచ్చితంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడితేనే ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యినట్టు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది కాబట్టి, కచ్చితంగా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు మేకర్స్. అలాగే ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ కేవలం తెలుగు వెర్షన్ కి గాను 105 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ఫ్యాన్స్.