https://oktelugu.com/

Akhanda 2 : అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో… ఈయన క్యారెక్టర్ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు…

సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఇండస్ట్రీలో అన్ని రకాల హీరోలు ఉన్నప్పటికీ జనాలు మాత్రం కేవలం స్టార్ హీరోల సినిమాలు చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు... ఇక అందుకే మీడియం రేంజ్ హీరోలు కూడా స్టార్ హీరో రేంజ్ కి ఎదగాలని కోరుకుంటారు. అలా చేయడం వల్ల ప్రేక్షకులు వాళ్ళ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించడమే కాకుండా వీళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 07:37 AM IST

    Bollywood star hero in Akhanda 2... you will be surprised if you know what his character is...

    Follow us on

    Akhanda 2  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ వరుస సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తమకంటూ ఒక స్టార్ స్టేటస్ ని సంపాదించుకోవడంలో కూడా వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఉండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక వాళ్ళిద్దరూ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధ్యతలు మూసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
    ఈ సినిమా పూర్తయిన వెంటనే అఖండ 2 సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను భారీ ఎలివేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బోయపాటి మరోసారి బాలయ్య బాబును ఢీకొట్టే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
    ఇక ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనేదాని మీదనే సర్వత్ర రాసక్తి అయితే ఉంది. ఇక ముహూర్తం రోజే బాలయ్య ఒక భారీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులందరిని ఆనంద పరచాడు. మరి ఇలాంటి బాలయ్యను డీ కొట్టాలంటే నార్మల్ విలన్ అయితే సరిపోదు. కాబట్టి బాలీవుడ్ నుంచి స్పెషల్ గా కొంతమందిని తీసుకొచ్చే పనిలో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజయ్ దేవగన్ గాని లేదంటే మాధవన్ ను గాని విలన్స్ గా  తీసుకునే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.
    వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే బోయపాటి సినిమాలో విలన్ పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పాత్రలు చేయాలంటే చాలా ఈజ్ తో నటించే నటులు కావాలి. అందువల్లే బోయపాటి వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…