Rishabh pant : 27 కోట్లకు అయితే అమ్ముడుపోయాడు గాని.. ఆ స్థాయిలో ఆట తీరు ప్రదర్శించడం లేదు రిషబ్ పంత్.. పైగా రోజురోజుకు దిగజారి పోతున్నాడు. అత్యంత అద్వానమైన బ్యాటింగ్ తో నిరాశకు గురి చేస్తున్నాడు. అసలు రిషబ్ పంత్ కు ఏమైంది? ఇలా ఎందుకు ఆడుతున్నాడు? నిరుడు ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించినప్పుడు గొప్పగా ఆడాడు కదా? సంజీవ్ గోయంక ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అనే ప్రశ్నలు రిషబ్ పంత్ అభిమానుల మదిలో మెదులుతున్నాయి.. ఇక మంగళవారం నాటి లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడో స్థానంలో వచ్చినప్పటికీ అతడు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. తద్వారా రిషబ్ పంత్ ఆట తీరుపై అందరిలోనూ ఆగ్రహం కలుగుతున్నది.
Also Read : ఓపెనర్ గా వచ్చినా సేమ్ అదే కథ.. పంత్ గ్రహచారం బాగోలేదా?
ఏడో స్థానంలో వచ్చి సున్నా
సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో తడబడింది. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. లక్నో జట్టులో ఓపెనర్లు మార్క్రం 52, షాన్ మార్ష్ 45, ఆయుష్ బదోని 36 పరుగులు చేశారు.. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పటికీ.. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అసలు బ్యాటింగ్ కు రావడానికే పంత్ భయపడ్డాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాల్సిన అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. తను ముందుకు రాకుండా.. సహచర ప్లేయర్లను ముందుకు తోస్తున్నాడు. వాస్తవానికి లక్నో జట్టు నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ పంత్ బ్యాటింగ్ కు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే. డగ్ అవుట్ లో ప్యాడ్లు కట్టుకొని అలానే నిల్చుండిపోయాడు. అంతేతప్ప తను మాత్రం మైదానంలోకి రాలేదు. వాస్తవానికి రిషబ్ పంత్ వన్ డౌన్ లో రావాలి. కానీ నాలుగు స్థానంలో అబ్దుల్ సమద్, ఐదో స్థానంలో మిల్లర్ ను పంపించాడు. ఆరో స్థానంలో ఆయుష్ బదోనిని పంపించాడు. అతడు అవుట్ అయిన తర్వాత ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ లో రిషబ్ పంత్ 27 కోట్లకు లక్నో జట్టుకు అమ్ముడుపోయాడు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరుపొందాడు. కానీ ఆటతీరులో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. రిషబ్ పంత్ వ్యవహార శైలి చూస్తే.. అతనిలో కాన్ఫిడెంట్ పూర్తిగా తగ్గిపోయినట్టు కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Also Read : రిషబ్ పంత్ ను 27 కోట్లు పెట్టి కొన్నది ఇందుకా? ఉండవల్లి అరుణ్ కుమార్ ను పెట్టుకున్నా సరిపోయేది కదా!