https://oktelugu.com/

Neha Shetty: టిల్లు స్క్వేర్ ఫేమ్ నేహా శెట్టి మైమరపించే అందాలు… చూస్తే అసలు తట్టుకోలేరు, గ్లామరస్ లుక్ వైరల్

తాజాగా పర్పుల్ కలర్ చీరలో పరువాల ప్రదర్శన చేసింది. కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. నేహా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Written By: , Updated On : April 13, 2024 / 03:51 PM IST
1 / 7 సన్నజాజి తీగకు చీర కడితే నేహా శెట్టిలా ఉంటుందేమో. అంత నాజూగ్గా ఉంటాయి నేహా అందాలు. ఈ గ్లామరస్ బ్యూటీ తెలుగులో మంచి పాపులారిటీ కలిగి ఉంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. Photo: Instagram
2 / 7 ఇంస్టాగ్రామ్ లో నేహా శెట్టిని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా పర్పుల్ కలర్ చీరలో పరువాల ప్రదర్శన చేసింది. కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. నేహా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo: Instagram
3 / 7 నేహా శెట్టి 2016లో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. కన్నడ చిత్రం ముంగారు మాలే 2లో నటించింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం మెహబూబా. దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మించగా ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేశాడు. అంచనాల మధ్య విడుదలైన మెహబూబా ఆశించిన స్థాయిలో ఆడలేదు. Photo: Instagram
4 / 7 సందీప్ కిషన్ కి జంటగా గల్లీ రౌడీ చిత్రం చేసింది. అది కూడా నిరాశపరిచింది. నేహా శెట్టికి ఫేమ్ తెచ్చిన చిత్రం మాత్రం డీజే టిల్లు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నేహా శెట్టి అద్భుతం చేసింది. రాధిక క్యారెక్టరైజేషన్ కి నేహా శెట్టి చక్కగా సెట్ అయ్యింది. Photo: Instagram
5 / 7 డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రాధిక గ్లామర్, సిద్ధూ జొన్నలగడ్డ యాక్టింగ్ ఆ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. డీజే టిల్లు సక్సెస్ నేపథ్యంలో దానికి సీక్వెల్ తెరకెక్కించారు. టిల్లు స్క్వేర్ ఇటీవల విడుదలై డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. Photo: Instagram
6 / 7 టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే రాధిక పాత్రను చివర్లో పరిచయం చేశారు. నేహా శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆమెను చూసిన ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు. అంతగా రాధిక పాత్ర వాళ్లకు కనెక్ట్ అయ్యింది.  Photo: Instagram
7 / 7 ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం చేస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ విలేజ్ డ్రామా అని సమాచారం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రోమోలు, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంతో నేహా శెట్టికి మరో హిట్ పడవచ్చు.. Photo: Instagram