Kriti Sanon breakup: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు కృతి సనన్. ఈమె మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈమె అవకాశాలు ఆగలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె నాగ చైతన్య హీరో గా నటించిన ‘దోచేయ్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి మరో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ, ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ , ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ని సైతం అందుకొని చరిత్ర సృష్టించింది.
రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ లో ‘కాక్ టైల్ 2’ అనే చిత్రం లో నటించింది. షాహిద్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కృతి సనన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. కేవలం ఆమె కారణంగానే ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయ్యింది. ఇకపోతే కృతి సనన్ సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక ఫోటో, సోషల్ మీడియా లో ఇంతకాలం సాగిన రూమర్స్ కి చెక్ పెట్టేలా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే కృతి సనన్ గత కొంతకాలంగా లండన్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బాహియా తో ప్రేమాయణం నడుపుతోంది. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాలకు చెక్ పెడుతూ కృతి సనన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. జూన్ నెలకు సంబంధించి ఆమె చేసిన పనులను ఒక ఫోటో ఆల్బుమ్ లాగా షేర్ చేసింది కృతి సనన్. ఆ ఫోటోలలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కబీర్ తో ఉన్న ఫోటో కూడా ఒకటి ఉంది. ఈ ఫోటో తో ఆమె మేమిద్దరం ఇప్పటికీ కలిసే ఉన్నాం , సోషల్ మీడియా లో జరిగే దుష్ప్రచారాలు నమ్మకండి అంటూ పరోక్షంగా తన అభిమానులకు చెప్తున్నట్టుగా అనిపించింది . సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
