https://oktelugu.com/

Disha Patani: చీర కట్టులో ఇంత హాట్ గానా… కల్కి ఫేమ్ దిశా పటాని లేటెస్ట్ లుక్ చూస్తే చెమటలు పట్టాల్సిందే! వైరల్ ఫోటోలు

Disha Patani: తాజాగా డిజైనర్ శారీలో మైండ్ బ్లాక్ చేసింది. నాజూకైన దిశా పటాని మేను పై చీర నిలవలేను అంటుంది. జారిపోతున్న చీరలో మరింతగా కుర్రాళ్ల హృదయాలు డామేజ్ చేసింది. దిశా పటాని లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Written By: , Updated On : July 12, 2024 / 05:04 PM IST
1 / 8 దిశా పటాని గ్లామర్ క్వీన్ అనడంలో సందేహం లేదు. ఈ బాలీవుడ్ భామ సోషల్ మీడియా వేదికగా చేసే సంచనాలు అన్నీ ఇన్నీ కావు. బ్రహ్మకైనా రిమ్మ తెలుగు పుట్టు అనే సామెత బహుశా ఆమెను చేశాకే పుట్టిందేమో అన్నట్లు ఉంటుంది. మోడ్రన్ డ్రెస్ వేసినా... ట్రెడిషనల్ వేర్ ధరించినా హాట్నెస్ మాత్రం కామన్. Photo: Instagram
2 / 8 తాజాగా డిజైనర్ శారీలో మైండ్ బ్లాక్ చేసింది. నాజూకైన దిశా పటాని మేను పై చీర నిలవలేను అంటుంది. జారిపోతున్న చీరలో మరింతగా కుర్రాళ్ల హృదయాలు డామేజ్ చేసింది. దిశా పటాని లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. Photo: Instagram
3 / 8 ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. మోడల్ గా ఉన్న దిశా పటానీకి లోఫర్ మూవీలో ఆఫర్ ఇచ్చాడు. హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ వెంటనే బాలీవుడ్ కి వెళ్లిన దిశా పటాని అక్కడ సక్సెస్ అయ్యింది.  Photo: Instagram
4 / 8 ధోని, భాగీ, భారత్ చిత్రాల్లో ఆమె స్టార్ హీరోయిన్ హోదా పొందింది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మూవీ చేసింది. ఇటీవల విడుదలైన కల్కి 2829 AD మూవీలో దిశా పటాని రాక్సీ అనే పాత్ర చేసింది. కల్కి మూవీలో భైరవ ప్రభాస్ నే భయపెట్టే పాత్రగా ఆమెది ఉంది. అయితే దిశా పటాని పాత్రకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. Photo: Instagram
5 / 8 అయితే కల్కి చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంది. మరి సీక్వెల్ లో అయినా దిశా పటాని పాత్రకు ప్రాధాన్యత ఉంటుందేమో చూడాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ఇతర ప్రధాన పాత్రలు చేశారు. కల్కి రూ. 1000 కోట్ల వసూళ్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. అనేక రికార్డులు బ్రేక్ చేసింది. Photo: Instagram
6 / 8 దిశా పటాని పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ఆమె కొన్నాళ్ళు ఎఫైర్ నడిపింది. కానీ ఎప్పుడు తాను టైగర్ తో రిలేషన్ లో ఉన్నట్లు దిశా పటాని వెల్లడించలేదు. కానీ వారిద్దరి మధ్య బంధం ఉందనేది మాత్రం నిజం. గత ఏడాది టైగర్ ష్రాఫ్-దిశా పటాని విడిపోయారు. దిశా పటాని కొత్త ప్రియుడితో కనిపిస్తుంది. Photo: Instagram
7 / 8 ఫిట్నెస్ ట్రైనర్ అలెక్సాండర్ ఇల్లిక్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇతడు ఫిట్నెస్ ట్రైనర్. దిశా పటాని ఎక్కాడు వెళ్లినా ఆయనతో వెళుతుంది. అలెక్సాండర్ ఇల్లిక్ తో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. దీంతో వారి రిలేషన్ పై పూర్తి స్పష్టత వచ్చింది. Photo: Instagram
8 / 8 దిశా పటాని చేతిలో మరో భారీ చిత్రం ఉంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువా మూవీలో దిశా పటాని హీరోయిన్. ఈ చిత్రానికి శివ దర్శకుడు. కంగువా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన టీజర్స్ ఆకట్టుకున్నాయి. సూర్య రెండు భిన్నమైన పాత్రలు చేస్తున్నారు. కంగువా తో పాటు వెల్కమ్ టు ది జంగిల్ టైటిల్ తో మరొక చిత్రం చేస్తుంది. కంగువా విజయం సాధించిన నేపథ్యంలో దిశా పటాని సౌత్ లో బిజీ కావడం ఖాయం. Photo: Instagram